Vaana vaana velluvaaye

వాన వాన వెల్లువాయె
Year
Language

పల్లవి:

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో.. ఏదో..ఏదో.. హాయి

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో.. ఏదో.. ఏదో.. హాయి

చరణం 1:

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగమహరాజుకి సొంతం

హో తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చిగురుటాకులా చలికి ఒణుకుతూ చెలియ చేరగా
ఏదో.. ఏదో.. ఏదో.. హాయి

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె...

చరణం 2:

ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోలా
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల

కలవరింతలే పలకరింపులై పదును మీరగా
ఏదో.. ఏదో.. ఏదో.. హాయి

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో.. ఏదో.. ఏదో..హాయి

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో.. ఏదో.. ఏదో... హాయి

pallavi:

vāna vāna vĕlluvāyĕ kŏṁḍagona tuḽḽiboyĕ
sĕliya sūbule silibi jallulai menu tāgagā
edo.. edo..edo.. hāyi

vāna vāna vĕlluvāyĕ kŏṁḍagona tuḽḽiboyĕ
priyuni śhvāsale pillagālulai momu tāgagā
edo.. edo.. edo.. hāyi

saraṇaṁ 1:

sakkani sĕkkili siṁde aṁdabu gaṁdhaṁ
pakkana serina magamaharājugi sŏṁtaṁ

ho tŏlagari siḍabaḍa sinugulalo magaraṁdaṁ
sittaḍi puttaḍi nelagade ānaṁdaṁ
siguruḍāgulā saligi ŏṇugudū sĕliya seragā
edo.. edo.. edo.. hāyi

vāna vāna vĕlluvāyĕ kŏṁḍagona tuḽḽiboyĕ...

saraṇaṁ 2:

ŏgarigi ŏgarai hattuguboyina veḽā
ŏḍilo regĕnu edo tĕliyani jvālā
musirina sīgaḍilo sirugālula golā
bigisina kaugiḍa karigiṁchĕnu paruvāla

kalavariṁtale palagariṁpulai padunu mīragā
edo.. edo.. edo.. hāyi

vāna vāna vĕlluvāyĕ kŏṁḍagona tuḽḽiboyĕ
sĕliya sūbule silibi jallulai menu tāgagā
edo.. edo.. edo..hāyi

vāna vāna vĕlluvāyĕ kŏṁḍagona tuḽḽiboyĕ
priyuni śhvāsale pillagālulai momu tāgagā
edo.. edo.. edo... hāyi