Title (Indic)నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్న& WorkGaayam Year1993 LanguageTelugu Credits Role Artist Music Shree Performer Balasubramaniam S.P. Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని మారదు లోకం మారదు కాలం చరణం 1: గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం రామబాణమార్పిందా రావణ కాష్ఠం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం చరణం 2: పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా వేట అదే వేటు అదే నాటి కధే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ Englishpallavi: nigga dīsi aḍugu ī sigguleni janānni aggidoḍi kaḍugu ī samāja jīvachchavānni māradu logaṁ māradu kālaṁ devuḍu digi rāni yĕvvaru yemai poni māradu logaṁ māradu kālaṁ saraṇaṁ 1: gāli vāḍu gamanānigi kāli bāḍa denigi gŏrrĕdāḍu maṁdagi mī jṇānabodha denigi ye saritra nersuguṁdi pachchani pāṭhaṁ ye kṣhaṇāna mārsuguṁdi jittula mārgaṁ rāmabāṇamārbiṁdā rāvaṇa kāṣhṭhaṁ kṛṣhṇa gīda ābiṁdā nitya kurukṣhetraṁ saraṇaṁ 2: pāda rādi guhalu pāla rādi gṛhālayinā aḍavi nīdi māriṁdā ĕnni yugālayinā veḍa ade veḍu ade nāḍi kadhe aṁtā naṭṭaḍavulu naḍivīdhigi naḍisŏste viṁtā balavaṁtulĕ bradagālani sūkti maravaguṁḍā śhadābdhālu sadavaledā ī araṇyagāṁḍa