Gaaligadubu ledu kadaligamtu ledu

గాలికదుపు లేదు కడలికంతు లేదు
Year
Language

పల్లవి:

గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా||2||

చరణం 1:

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో ||2||

తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేగకేది కట్టుబాటు
మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు

చరణం 2:

ఓ తెమ్మెరా ఊపవే ఊహలా ఊయల నన్నూ
ఓ మల్లికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకూ

తల్లి మళ్ళి తరుణయ్యింది పూవు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచివేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముందీ

pallavi:

gāligadubu ledu kaḍaligaṁtu ledu
gaṁga vĕlluvā kamaṁḍalaṁlo imiḍedenā
urige manasugu giri gīste adi āgedenā||2||

saraṇaṁ 1:

ā niṁgilo mabbunai pāḍanā pāḍalu ĕnno
ī nelabai nĕmalinai āḍanā āḍalu ĕnno ||2||

tuḽḽi tuḽḽi gaṁtulu vese legagedi kaṭṭubāḍu
maḽḽī maḽḽī vasaṁtamŏste mallĕgela āgusāḍu

saraṇaṁ 2:

o tĕmmĕrā ūbave ūhalā ūyala nannū
o malligā ivvave navvulā māliga nāgū

talli maḽḽi taruṇayyiṁdi pūvu pūsi mŏggayyiṁdi
guḍini viḍisiverŏga guḍilo pramidanaide tappemuṁdī