Flying on the moon

Flying on the moon
Work
Year
Language

పల్లవి:

నేను నేనుగా ఇక నేనె నేనుగా
నేను నేనుగా ఇక నేనె నేనుగా
వెలుగు నీడలా వెంటాడుతోందిగా
మేఘాలా మెరుపు దారుల్లో
ఊరేగాలా తనువు తారల్లో
ఓ నేస్తం ఈ మాయే నీదేనా..
ఈ'ం ఫ్ల్యింగ్ ఒన్ థె మూన్ ఫ్ల్యింగ్ ఒన్ మూన్...
నేను నేనుగా ఇక నేనె నేనుగా
వెలుగు నీడలా వెంటాడుతోందిగా

చరణం 1:

కోరుకున్నవన్ని కలగనే కన్ను
కానరాని నిన్నే వెతుకుతోంది
నిన్నలేని ఆశే ఇపుడిలా నన్ను
నిన్ను చూపుమంటు తరుముతోంది
గాలి వెంట తిరుగు ఊహకి
గమ్యమంటు ఒకటి ఉందని
ఆకతాయి గడుసు గుండెలోన
ఆశయాలు తెలుపు జీవితాన్ని
ఈ రోజు నాకు చుపింది నువ్వా
చీకటే చేరినా తోడయ్యే వెలుగువా

నేను నేనుగా ఇక నేనె నేనుగా
వెలుగు నీడలా వెంటాడుతోందిగా

చరణం 2:

ఉన్నపాటుగా నీ పరిచయం మంచి
ఊహలెన్నో రేపి అల్లుకుంది
అందమైన లోకం ఎదురుగా వచ్చి
అంతులేని హాయే పంచుతోంది
ఇప్పుడింక ఎవరు ఆపినా
వెల్లువైన మనసు ఆగునా
నింగిలోని తళుకు తారనైనా
తెంచుకొచ్చే తెగువ నేనయ్యానా
ఏ చోటనున్నా నీ గుర్తులేనా
మాటలే బాటలై నన్నిలా నడిపెనా

నేను నేనుగా ఇక నేనె నేనుగా
వెలుగు నీడలా వెంటాడుతోందిగా
మేఘంలో మెరుపు దారుల్లో
ఊరేగాలా తనువు తారల్లో
ఓ నేస్తం ఈ మాయే నీదేనా..
I'm flying on the moon flying on moon
I'm flying on the moon flying on moon
I'm flying on the moon flying on moon

pallavi:

nenu nenugā iga nenĕ nenugā
nenu nenugā iga nenĕ nenugā
vĕlugu nīḍalā vĕṁṭāḍudoṁdigā
meghālā mĕrubu dārullo
ūregālā tanuvu tārallo
o nestaṁ ī māye nīdenā..
ī'ṁ phlyiṁk ŏn dhĕ mūn phlyiṁk ŏn mūn...
nenu nenugā iga nenĕ nenugā
vĕlugu nīḍalā vĕṁṭāḍudoṁdigā

saraṇaṁ 1:

korugunnavanni kalagane kannu
kānarāni ninne vĕdugudoṁdi
ninnaleni āśhe ibuḍilā nannu
ninnu sūbumaṁṭu tarumudoṁdi
gāli vĕṁṭa tirugu ūhagi
gamyamaṁṭu ŏgaḍi uṁdani
āgadāyi gaḍusu guṁḍĕlona
āśhayālu tĕlubu jīvidānni
ī roju nāgu subiṁdi nuvvā
sīgaḍe serinā toḍayye vĕluguvā

nenu nenugā iga nenĕ nenugā
vĕlugu nīḍalā vĕṁṭāḍudoṁdigā

saraṇaṁ 2:

unnabāḍugā nī parisayaṁ maṁchi
ūhalĕnno rebi alluguṁdi
aṁdamaina logaṁ ĕdurugā vachchi
aṁtuleni hāye paṁchudoṁdi
ippuḍiṁka ĕvaru ābinā
vĕlluvaina manasu āgunā
niṁgiloni taḽugu tāranainā
tĕṁchugŏchche tĕguva nenayyānā
e soḍanunnā nī gurdulenā
māḍale bāḍalai nannilā naḍibĕnā

nenu nenugā iga nenĕ nenugā
vĕlugu nīḍalā vĕṁṭāḍudoṁdigā
meghaṁlo mĕrubu dārullo
ūregālā tanuvu tārallo
o nestaṁ ī māye nīdenā..
I'm flying on the moon flying on moon
I'm flying on the moon flying on moon
I'm flying on the moon flying on moon