Evaro.. evaro.. edalo evaro

ఎవరో.. ఎవరో.. ఎదలో ఎవరో
Year
Language

పల్లవి:

ఎవరో.. ఎవరో.. ఎదలో ఎవరో
అనుకోని వరమై చేరే.. అమృతాల వరదై పారే

తన పేరే ప్రేమా..ఆ.. తనదే ఈ మహిమా
తనదే తొలి జన్మా..ఆ.. తరువాతే బ్రహ్మా

ఎవరో.. ఎవరో.. ఎదలో ఎవరో..

చరణం 1:

చూపుల్లో పున్నమి రేఖలుగా.. రూపంలో పుత్తడి రేఖలుగా
మారింది జీవన రేఖ నా హృదయంలో తానే చేరాకా

అధరాలే మన్మధ లేఖ రాయగా..
అడుగేమో లక్ష్మణ రేఖ దాటగా..

బిడియాలా బాటలో.. నడిపే వారెవరో
బడిలేనీ పాఠమే.. నేర్పే తానెవరో

విడిపోని.. ముడివేసి.. మురిసేదెవ్వరో..

ఎవరో.. ఎవరో..

చరణం 2:

మల్లెలతో స్నానాలే పోసి.. నవ్వులతో నగలెన్నో వేసి
చీకటితో కాటుక పెట్టీ.. నన్నే తానూ నీకై పంపింది

సొగసంత సాగరమల్లే మారగా..
కవ్వింత కెరటాలల్లే పొంగగా..

సరసాలా నావలో.. చేరే వారెవరో
మధురాలా లోతులో.. ముంచే తానెవరో

పులకింత ముత్యాలే పంచేదెవ్వరో.. ఎవరో..

ఎవరో.. ఎవరో.. ఎదలో ఎవరో
అనుకోని వరమై చేరే.. అమృతాల వరదై పారే

తన పేరే ప్రేమా..ఆ.. తనదే ఈ మహిమా
తనదే తొలి జన్మా..ఆ.. తరువాతే బ్రహ్మా

pallavi:

ĕvaro.. ĕvaro.. ĕdalo ĕvaro
anugoni varamai sere.. amṛtāla varadai pāre

tana pere premā..ā.. tanade ī mahimā
tanade tŏli janmā..ā.. taruvāde brahmā

ĕvaro.. ĕvaro.. ĕdalo ĕvaro..

saraṇaṁ 1:

sūbullo punnami rekhalugā.. rūbaṁlo puttaḍi rekhalugā
māriṁdi jīvana rekha nā hṛdayaṁlo tāne serāgā

adharāle manmadha lekha rāyagā..
aḍugemo lakṣhmaṇa rekha dāḍagā..

biḍiyālā bāḍalo.. naḍibe vārĕvaro
baḍilenī pāṭhame.. nerbe tānĕvaro

viḍiboni.. muḍivesi.. murisedĕvvaro..

ĕvaro.. ĕvaro..

saraṇaṁ 2:

mallĕlado snānāle posi.. navvulado nagalĕnno vesi
sīgaḍido kāḍuga pĕṭṭī.. nanne tānū nīgai paṁpiṁdi

sŏgasaṁta sāgaramalle māragā..
kavviṁta kĕraḍālalle pŏṁgagā..

sarasālā nāvalo.. sere vārĕvaro
madhurālā lodulo.. muṁche tānĕvaro

pulagiṁta mutyāle paṁchedĕvvaro.. ĕvaro..

ĕvaro.. ĕvaro.. ĕdalo ĕvaro
anugoni varamai sere.. amṛtāla varadai pāre

tana pere premā..ā.. tanade ī mahimā
tanade tŏli janmā..ā.. taruvāde brahmā