Evarigi seppedi? emani seppedi?

ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
Year
Language

పల్లవి:

ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా.. చిరుగాలికా..
ఉరకలు వేసే నీటికా.. సెలయేటికా..
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

చరణం 1:

నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను (2)
నన్నే తలచి మదిలో వలచి (2)
దివి నుండి తానె దిగి రాగా ఆ ఆ ఆ...
కలవరపరచే కమ్మని తలపులు.. ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

చరణం 2:

మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం(2)
పొందు కోరి పొంచిన పరువం(2)
నచ్చిన వానిని పెనేసుకోదా.. ఆ ఆ ఆ..
ఉప్పెనలా వచ్చే ఊహలు ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా చిరుగాలికా
ఉరకలు వేసే నీటికా సెలయేటికా..
లాల లలల లలాలల
లాల లలల లలాలల

pallavi:

ĕvarigi sĕppedi? emani sĕppedi?
nenĕvarigi sĕppedi manasippemani sĕppedi
horuna vīse gāligā.. sirugāligā..
uragalu vese nīḍigā.. sĕlayeḍigā..
ĕvarigi sĕppedi? emani sĕppedi?

saraṇaṁ 1:

nīḍiloni kaluvanu nenu.. niṁginele jābili tānu (2)
nanne talasi madilo valasi (2)
divi nuṁḍi tānĕ digi rāgā ā ā ā...
kalavarabarase kammani talabulu.. ivi.. ivi..
ani ĕvarigi sĕppedi? emani sĕppedi?

saraṇaṁ 2:

mallĕ tīgalu paṁdiri kosaṁ ĕdigĕdigi ĕgabāgina saṁdaṁ(2)
pŏṁdu kori pŏṁchina paruvaṁ(2)
nachchina vānini pĕnesugodā.. ā ā ā..
uppĕnalā vachche ūhalu ivi.. ivi..
ani ĕvarigi sĕppedi? emani sĕppedi?
nenĕvarigi sĕppedi manasippemani sĕppedi
horuna vīse gāligā sirugāligā
uragalu vese nīḍigā sĕlayeḍigā..
lāla lalala lalālala
lāla lalala lalālala