Emta emta vimta mohamo

ఎంత ఎంత వింత మోహమో
Year
Language

పల్లవి:

చందమామ వచ్చిన చల్లగాలి వీచిన చిచ్చు ఆరదేలనమ్మ
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మ
చందనాలు పూసినా ఎంత సేవ చేసిన చింత తీరదేలనమ్మ
ఓ సఖియా ఉన్న మాట ఒప్పుకోమ్మ
జంట లేదనా హా హా హా ఇంత వేదన హో హో హో
జంట లేదనా ఇంత వేదనా
ఎంత చిన్న బోతివమ్మ

చందమామ వచ్చిన చల్లగాలి వీచిన చిచ్చు ఆరదేలనమ్మ
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మ
ఓ సఖియా ఉన్న మాట ఒప్పుకోమ్మ

ఓ ఓ ఓ మురిపాల మల్లికా... దరిచేరు కుంటినే పరువాల వల్లిక
ఇది మరులుగొన్న మహిమో నిన్ను మరువలేని మైకమో

ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో
మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో
ప్రణయానుబంధమెంత చిత్రమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో

చరణం 1:

విరిసిన వనము యవ్వనము
పిలిచింది చిలిపి వేడుక కిల కిల పాటగా
చలువల వరము కలవరము
తరిమింది తీపి కోరిక చెలువను చూడగా
దరిశనమీయవే సరసకు చేరగా
తెరలను తీయవే తళుకుల తారక
మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక

ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో

చరణం 2:

కలలను రేపే కళ వుంది అలివేణి కంటి సైగలో జిగి బిగి సోకులో
ఎడదను ఊపే ఒడుపుంది సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో
కదలని ఆటగా నిలిచిన వేడుక
బదులిడ రావుగా పిలిచిన కోరిక
బిడియమదేలా ప్రియురాల మణిమేఖలా

ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో
మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో
ప్రణయానుబంధమెంత చిత్రమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో

pallavi:

saṁdamāma vachchina sallagāli vīsina sichchu āradelanamma
o sĕliyā saṁgademo sĕppavamma
saṁdanālu pūsinā ĕṁta seva sesina siṁta tīradelanamma
o sakhiyā unna māḍa ŏppugomma
jaṁṭa ledanā hā hā hā iṁta vedana ho ho ho
jaṁṭa ledanā iṁta vedanā
ĕṁta sinna bodivamma

saṁdamāma vachchina sallagāli vīsina sichchu āradelanamma
o sĕliyā saṁgademo sĕppavamma
o sakhiyā unna māḍa ŏppugomma

o o o muribāla malligā... dariseru kuṁṭine paruvāla valliga
idi marulugŏnna mahimo ninnu maruvaleni maigamo

ĕṁta ĕṁta viṁta mohamo
radigāṁtuni śhṛṁgāra maṁtramo
ĕṁta ĕṁta viṁta mohamo
radigāṁtuni śhṛṁgāra maṁtramo
maru mallĕla saramo viri villula śharamo
maru mallĕla saramo viri villula śharamo
praṇayānubaṁdhamĕṁta sitramo
ĕṁta ĕṁta viṁta mohamo
radigāṁtuni śhṛṁgāra maṁtramo

saraṇaṁ 1:

virisina vanamu yavvanamu
pilisiṁdi silibi veḍuga kila kila pāḍagā
saluvala varamu kalavaramu
tarimiṁdi tībi koriga sĕluvanu sūḍagā
dariśhanamīyave sarasagu seragā
tĕralanu tīyave taḽugula tāraga
madanuḍi lekha śhaśhirekha abhisāriga

ĕṁta ĕṁta viṁta mohamo
radigāṁtuni śhṛṁgāra maṁtramo

saraṇaṁ 2:

kalalanu rebe kaḽa vuṁdi aliveṇi kaṁṭi saigalo jigi bigi sogulo
ĕḍadanu ūbe ŏḍubuṁdi sumabāla tīga menilo sŏgasula tāvilo
kadalani āḍagā nilisina veḍuga
baduliḍa rāvugā pilisina koriga
biḍiyamadelā priyurāla maṇimekhalā

ĕṁta ĕṁta viṁta mohamo
radigāṁtuni śhṛṁgāra maṁtramo
ĕṁta ĕṁta viṁta mohamo
radigāṁtuni śhṛṁgāra maṁtramo
maru mallĕla saramo viri villula śharamo
maru mallĕla saramo viri villula śharamo
praṇayānubaṁdhamĕṁta sitramo
ĕṁta ĕṁta viṁta mohamo
radigāṁtuni śhṛṁgāra maṁtramo