Emta dooramoo

ఎంత దూరమూ
Work
Year
Language

పల్లవి:

ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ ||2||
పరిమళించు పాన్పులకూ నిరీక్షించు చూపులకూ ||2||
వేసిన తలపులకూ వేచిన తలపులకూ
ఎంత చేరువో అది అంత దూరము

ఎంత దూరమూ అదీ యెంత దూరమూ ||2||
ఉదయించే కిరణాలకు ఉప్పొంగే కెరటాలకు..||2||
కలలుగనే చెలునికీ కలతపడే చెలియకు
ఎంత చేరువో అది అంత దూరము

చరణం 1:

ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ ||2||
మనసు పడని సంపంగికి, మరులు విడని భ్రమరానికి ||2||
ఉన్నదానికీ, అనుకున్నదానికీ
ఎంత చేరువో అది అంత దూరము

చరణం 2:

ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ ||2||
అల్లనాటి ఆశలకూ, అణగారిన బాసలకూ ||2||
మరువరాని అందానికి, చెరిగిపోని బంధానికి
ఎంత చేరువో అది అంత దూరము

ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ ||2||

pallavi:

ĕṁta dūramū adī ĕṁta dūramū ||2||
parimaḽiṁchu pānpulagū nirīkṣhiṁchu sūbulagū ||2||
vesina talabulagū vesina talabulagū
ĕṁta seruvo adi aṁta dūramu

ĕṁta dūramū adī yĕṁta dūramū ||2||
udayiṁche kiraṇālagu uppŏṁge kĕraḍālagu..||2||
kalalugane sĕlunigī kaladabaḍe sĕliyagu
ĕṁta seruvo adi aṁta dūramu

saraṇaṁ 1:

ĕṁta dūramū adī ĕṁta dūramū ||2||
manasu paḍani saṁpaṁgigi, marulu viḍani bhramarānigi ||2||
unnadānigī, anugunnadānigī
ĕṁta seruvo adi aṁta dūramu

saraṇaṁ 2:

ĕṁta dūramū adī ĕṁta dūramū ||2||
allanāḍi āśhalagū, aṇagārina bāsalagū ||2||
maruvarāni aṁdānigi, sĕrigiboni baṁdhānigi
ĕṁta seruvo adi aṁta dūramu

ĕṁta dūramū adī ĕṁta dūramū ||2||