Emido idi emido

ఏమిటో ఇది ఏమిటో
Year
Language

పల్లవి:

ఏమిటో... ఇది ఏమిటో
పలుకలేని మౌనగీతి...తెలియరాని అనుభూతి
ఏమిటో ...ఇది ఏమిటో
ఏమిటో... ఇది ఏమిటో...
పలుకలేని మౌనగీతి...తెలియరాని అనుభూతి
ఏమిటో... ఇది ఏమిటో...

చరణం 1:

అద్దంలో నా నీడ...ముద్దు ముద్దుగ తోచింది
ఆ నీడ నను చూసి...అదోలా నవ్వేసింది
ఉత్తకనే చిలిపి పయ్యేద..చప్పున జారి పోయింది
ఒంటరిగా... పడుకుంటే...
ఒంటరిగా పడుకుంటే ...కొంటె నిదుర రానంటుందీ
పలుకలేని మౌన గీతి...తెలియరాని అనుభూతి
ఏమిటో ...ఇది ఏమిటో

చరణం 2:

చీకటిలో నిదుర రానిచో...చిరు దివ్వెను వెలిగించనా
ఆ చిరువెలుగే పనికిరానిచో...నా కనులే వెలిగించనా
తలపులు దాచిన నా మనసే...తలగడగా అందించనా
కమ్మని కలలే.... పండెదాకా..
కమ్మని కలలే పండెదాకా...కథలేవో వినిపించనా
పలుకలేని మౌనగీతి...తెలియరాని అనుభూతి
ఏమిటో... ఇది ఏమిటో...

చరణం 3:

గుండెలోనా వలపు మల్లి ...కొత్తరేకులు విరిసింది
కిటికీలోన జాబిల్లీ...కటిక నిప్పులు చెరిగింది
విరిసిన వలపే ఘుమ ఘుమలాడే...తరుణం రానే వస్తుంది
కోరిన ప్రియుడే సందిట ఉంటే...గుండె చల్లబడిపొతుంది
ఆ...ఊ...
ఏమిటో... ఇది ఏమిటో...
పలుకలేని మౌనగీతి...తెలియరాని అనుభూతి
ఏమిటో ....ఇది ఏమిటో....

pallavi:

emiḍo... idi emiḍo
palugaleni maunagīdi...tĕliyarāni anubhūdi
emiḍo ...idi emiḍo
emiḍo... idi emiḍo...
palugaleni maunagīdi...tĕliyarāni anubhūdi
emiḍo... idi emiḍo...

saraṇaṁ 1:

addaṁlo nā nīḍa...muddu mudduga tosiṁdi
ā nīḍa nanu sūsi...adolā navvesiṁdi
uttagane silibi payyeda..sappuna jāri poyiṁdi
ŏṁṭarigā... paḍuguṁṭe...
ŏṁṭarigā paḍuguṁṭe ...kŏṁṭĕ nidura rānaṁṭuṁdī
palugaleni mauna gīdi...tĕliyarāni anubhūdi
emiḍo ...idi emiḍo

saraṇaṁ 2:

sīgaḍilo nidura rāniso...siru divvĕnu vĕligiṁchanā
ā siruvĕluge panigirāniso...nā kanule vĕligiṁchanā
talabulu dāsina nā manase...talagaḍagā aṁdiṁchanā
kammani kalale.... paṁḍĕdāgā..
kammani kalale paṁḍĕdāgā...kathalevo vinibiṁchanā
palugaleni maunagīdi...tĕliyarāni anubhūdi
emiḍo... idi emiḍo...

saraṇaṁ 3:

guṁḍĕlonā valabu malli ...kŏttaregulu virisiṁdi
kiḍigīlona jābillī...kaḍiga nippulu sĕrigiṁdi
virisina valabe ghuma ghumalāḍe...taruṇaṁ rāne vastuṁdi
korina priyuḍe saṁdiḍa uṁṭe...guṁḍĕ sallabaḍibŏduṁdi
ā...ū...
emiḍo... idi emiḍo...
palugaleni maunagīdi...tĕliyarāni anubhūdi
emiḍo ....idi emiḍo....