Emayyimdo emo naa madilo eevela

ఏమయ్యిందో ఏమో నా మదిలో ఈవేళ
Year
Language

పల్లవి:

ఏమయ్యిందో ఏమో నా మదిలో ఈవేళ
ప్రేమయ్యిందో ఏమో అనుమానం కలిగేలా
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే ||2||

"హాయ్ రామా ఇదేమి ప్రేమ
హంగామా వరించ తరమా
అందమ్మా అయోమయంగా
ఉక్కిరిబిక్కిరి ఊపిరి సరిగమ "

చరణం 1:

ఏ చోటా నా పాదం నిలబడనంటుంది ..ప్రతిబాట నీవైపే పదపద అంటోంది
మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుంది ..అది కూడా చిత్రంగా బాగానే ఉంది
ఉప్పెనలా హృదయంలో చెలరేగే కలవరం ..తప్పుకొనే దారేదో వెతకాలి ఇద్దరం
ఎప్పుడు మొదలయ్యిందో ..ననులాగే ప్రియస్వరం
ఎప్పుడు ఎటు తోస్తుందో ..చెబుతుందా ఈక్షణం
అనుకోకుండా పడదోసింది వలపే నన్నిలా
హో విడిపోకుండా ముడివేసింది బిగిసే సంకెల !

"ఏం ప్రేమో మతే చెడంగా
చిక్కామొ అమాయకంగా
గుండెల్లో అదో రకంగా
చిందరవందర తొందర తికమక "

చరణం 2:

ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలు .. కోపంతో ఎరబ్రడి కసిరే నా కళ్లు
ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలు .. గుండెసడి ఉలికిపడి ఒకటే కంగారు
చప్పున ఒకటైపోదాం ఈ దూరం చెరగనీ .. ఎక్కడికైనా పోదాం మనలోకం వేరనీ
ఎవ్వరికీ ఏమాత్రం కనిపించం పొమ్మనీ .. ఆ క్షణమే మనకోసం ఏకాంతం చూడనీ
చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరదా
మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా !

pallavi:

emayyiṁdo emo nā madilo īveḽa
premayyiṁdo emo anumānaṁ kaligelā
avuno kādo aḍagālaṁṭe tĕguve sālade
nijamo kādo tĕliyagabode taguve telade ||2||

"hāy rāmā idemi prema
haṁgāmā variṁcha taramā
aṁdammā ayomayaṁgā
ukkiribikkiri ūbiri sarigama "

saraṇaṁ 1:

e soḍā nā pādaṁ nilabaḍanaṁṭuṁdi ..pradibāḍa nīvaibe padabada aṁṭoṁdi
manasaṁtā ĕṁdugano diguluga uṁṭuṁdi ..adi kūḍā sitraṁgā bāgāne uṁdi
uppĕnalā hṛdayaṁlo sĕlarege kalavaraṁ ..tappugŏne dāredo vĕdagāli iddaraṁ
ĕppuḍu mŏdalayyiṁdo ..nanulāge priyasvaraṁ
ĕppuḍu ĕḍu tostuṁdo ..sĕbuduṁdā īkṣhaṇaṁ
anugoguṁḍā paḍadosiṁdi valabe nannilā
ho viḍiboguṁḍā muḍivesiṁdi bigise saṁkĕla !

"eṁ premo made sĕḍaṁgā
sikkāmŏ amāyagaṁgā
guṁḍĕllo ado ragaṁgā
siṁdaravaṁdara tŏṁdara tigamaga "

saraṇaṁ 2:

ĕvarainā nī peru anuguṁṭe sālu .. kobaṁto ĕrabraḍi kasire nā kaḽlu
ĕvarainā ninu kŏṁchĕṁ gamaniste sālu .. guṁḍĕsaḍi uligibaḍi ŏgaḍe kaṁgāru
sappuna ŏgaḍaibodāṁ ī dūraṁ sĕraganī .. ĕkkaḍigainā podāṁ manalogaṁ veranī
ĕvvarigī emātraṁ kanibiṁchaṁ pŏmmanī .. ā kṣhaṇame managosaṁ egāṁtaṁ sūḍanī
siḍige vesi pilise prema manado seradā
manalo seri karige prema manamai māragā !