Emani paadedano ee velaa

ఏమని పాడెదనో ఈ వేళా
Year
Language

పల్లవి:

ఏమని పాడెదనో ఈ వేళా
ఏమని పాడెదనో ఈ వేళా
మానస వీణ మౌనముగా నిదురించిన వేళ
ఏమని పాడెదనో...

చరణం 1:

జగమే మరచి హృదయ విపంచి (2)
గారడిగా వినువీధి చరించీ (2)
కలత నిదురలో కాంచిన కలలే
గాలిమేడలై కూలిన వేళా

యేమని పాడెదనో...

చరణం 2:

వనసీమలలో హాయిగా ఆడే (2)
రాచిలుక నిను రాణిని చేసే (2)
పసిడి తీగలా పంజరమిదిగో
పలుకవేమనీ పిలిచేవేళా

pallavi:

emani pāḍĕdano ī veḽā
emani pāḍĕdano ī veḽā
mānasa vīṇa maunamugā niduriṁchina veḽa
emani pāḍĕdano...

saraṇaṁ 1:

jagame marasi hṛdaya vibaṁchi (2)
gāraḍigā vinuvīdhi sariṁchī (2)
kalada niduralo kāṁchina kalale
gālimeḍalai kūlina veḽā

yemani pāḍĕdano...

saraṇaṁ 2:

vanasīmalalo hāyigā āḍe (2)
rāsiluga ninu rāṇini sese (2)
pasiḍi tīgalā paṁjaramidigo
palugavemanī piliseveḽā