Em jarugudomdi

ఏం జరుగుతోంది
Work
Year
Language

పల్లవి:

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈ వేళా

హే నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగూ
ఏం పనట తమతో తనకు తెలుసా
నీ వెనక తిరిగే కనులు చూడవట వేరే కలలు
ఏం మాయ చేశావసలు సొగసా

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈ వేళా

చరణం 1:

పరాకులో పడిపోతుంటే కన్నె వయసు బంగారూ
అరె అరె అంటూ వచ్చి తోడు నిలబడూ

పొత్తిళ్లల్లో పసి పాపల్లే పాతికేళ్ల మగ ఈడూ
ఎక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడూ

ఆకాశమే ఆపలేని చినుకు మాదిరీ
నీ కోసమే దూకుతోంది చిలిపి లాహిరీ

ఆవేశమే ఓపలేని వేడి ఊపిరీ
నీతో సావాసమే కోరుతోంది ఆదుకో మరీ

this is the way to go this is ecstasy
this song is just awake mimicry
feeling is so meant to be..
this indescribable cant you see
knocks me down yo
baby cant believe
just a survival destiny yo.ho..

చరణం 2:

ఉండుండిలా ఉబికొస్తుందేం కమ్మనైన కన్నీరు
తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరూ

మధురమైన కబురందిందే కలత పడకు బంగారు
పెదవి తోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు

గంగ లాగి పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా

అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈ వేళ

హే నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు
ఏం మాయ చేశావసలు సొగసా

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈ వేళ

pallavi:

eṁ jarugudoṁdi eṁ jarugudoṁdi nā manasugivāḽā
eṁ vĕdugudoṁdi eṁ vĕdugudoṁdi nā vayasu ī veḽā

he nī ĕduḍa nilise varagu ābadaḍa tarime parugū
eṁ panaḍa tamado tanagu tĕlusā
nī vĕnaga tirige kanulu sūḍavaḍa vere kalalu
eṁ māya seśhāvasalu sŏgasā

eṁ jarugudoṁdi eṁ jarugudoṁdi nā manasugivāḽā
eṁ vĕdugudoṁdi eṁ vĕdugudoṁdi nā vayasu ī veḽā

saraṇaṁ 1:

parāgulo paḍiboduṁṭe kannĕ vayasu baṁgārū
arĕ arĕ aṁṭū vachchi toḍu nilabaḍū

pŏttiḽlallo pasi pāballe pādigeḽla maga īḍū
ĕkkĕkki eṁ kāvālaṁdo aḍugu ammaḍū

āgāśhame ābaleni sinugu mādirī
nī kosame dūgudoṁdi silibi lāhirī

āveśhame obaleni veḍi ūbirī
nīdo sāvāsame korudoṁdi ādugo marī

this is the way to go this is echstasy
this song is just awake mimichry
feeling is so meant to be..
this indeschribable chant you see
knochks me down yo
baby chant believe
just a survival destiny yo.ho..

saraṇaṁ 2:

uṁḍuṁḍilā ubigŏstuṁdeṁ kammanaina kannīru
tīyanaina gubulidi aṁṭe nammedĕvvarū

madhuramaina kaburaṁdiṁde kalada paḍagu baṁgāru
pĕdavi toḍi sĕkkili nimire sĕlimi hājaru

gaṁga lāgi pŏṁgi rānā prema saṁdramā
nīlo karigi aṁtamavanā prāṇa baṁdhamā

aṁtuleni dāhamavanā priya pravāhamā
nīdo kalisi pūrdi avanā mŏdaḍi snehamā

eṁ jarugudoṁdi eṁ jarugudoṁdi nā manasugivāḽa
eṁ vĕdugudoṁdi eṁ vĕdugudoṁdi nā vayasu ī veḽa

he nī ĕduḍa nilise varagu ābadaḍa tarime parugu
eṁ māya seśhāvasalu sŏgasā

eṁ jarugudoṁdi eṁ jarugudoṁdi nā manasugivāḽa
eṁ vĕdugudoṁdi eṁ vĕdugudoṁdi nā vayasu ī veḽa