Ekkada ekkada ekkada umdo taaraga

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
Work
Year
Language

పల్లవి:

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక

తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక

నా కోసమే తలుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో

పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
ఏ ఊరే అందమా ఆచూకి అందుమా

కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందొ తారక
ఒహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక

చరణం 1:

కులుకులు ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు
పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులు ఆ చూపులు చురుకైన చుర కత్తులు
పరుగులు ఆ అడుగులు గోదారిలో ఉప్పొంగులు

నా గుండెలో అదోమాదిరి నింపేయ్యకే సుధామాధురి
నా కళ్ళలో కలల పందిరి అల్లెయకోయి మహాపోకిరి

మబ్బులో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లె తాకింది బుగ్గల్లో పాకింది

ఒహో తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక

చరణం 2:

ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటని
అడిగితె చూపించనా నిలువెత్తు చిరునవ్వుని

మెరుపుని తోలి చినుకుని కలగలిపి చూడాలని
ఎవరికీ అనిపించినా చూడొచ్చు నా చెలియని

ఎన్నాలిలా తనోస్తాడని చూడాలటా ప్రతి దారిని
ఏతోటలో తనుందోనని ఎటు పంపను నా మనసుని

ఏనాడు ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుండా

pallavi:

ĕkkaḍa ĕkkaḍa ĕkkaḍa uṁdo tāraga
nālo ukkiri bikkiri ūhalu rebe gobiga

tuṁṭari tuṁṭari tuṁṭari sūbulu sāliga
ŏho allari allari allari āśhalu rebaga

nā kosame talukkannado
nā perune pilustunnado

pūvānagā kurustunnadi
nā sūbulo mĕrustunnadi
e ūre aṁdamā āsūgi aṁdumā

kavviṁche saṁdramā dobūse sālammā

ĕkkaḍa ĕkkaḍa ĕkkaḍa uṁdŏ tāraga
ŏho allari allari allari āśhalu rebaga

saraṇaṁ 1:

kulugulu ā mĕligĕlu meghālalo mĕrubulu
palugulu ā pĕdavulu mana tĕlugu rāsilagalu
padunulu ā sūbulu surugaina sura kattulu
parugulu ā aḍugulu godārilo uppŏṁgulu

nā guṁḍĕlo adomādiri niṁpeyyage sudhāmādhuri
nā kaḽḽalo kalala paṁdiri allĕyagoyi mahābogiri

mabbulo dāguṁdi tanavaibe lāgiṁdi
siggallĕ tāgiṁdi buggallo pāgiṁdi

ŏho tuṁṭari tuṁṭari tuṁṭari sūbulu sāliga

saraṇaṁ 2:

ĕvvarū nannaḍagare adagāḍi rūbeṁṭani
aḍigidĕ sūbiṁchanā niluvĕttu sirunavvuni

mĕrubuni toli sinuguni kalagalibi sūḍālani
ĕvarigī anibiṁchinā sūḍŏchchu nā sĕliyani

ĕnnālilā tanostāḍani sūḍālaḍā pradi dārini
edoḍalo tanuṁdonani ĕḍu paṁpanu nā manasuni

enāḍu iṁtidigā kaṁgāre ĕruganugā
avunannā kādannā guṁḍĕlagu kuduruṁḍā