ఈనాటి ఈ బంధమేనాటిదో (గతజన్మ)
పల్లవి:
ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..
చరణం 1:
చుక్కలు పొదిగిన ఆకాశం మక్కువలొలికే మనకోసం
చుక్కలు పొదిగిన ఆకాశం మక్కువలొలికే మనకోసం
మంచుతెరలలో మల్లెలతో..ఓ పందిరి మంచం వేసింది
మంచుతెరలలో మల్లెలతో..ఓ పందిరి మంచం వేసింది
ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..
చరణం 2:
నీ కనుపాపల ఊయలలో.. నే పసిపాపల పవళిస్తా.. ఆ..ఆ..
నీ కనుపాపల ఊయలలో.. నే పసిపాపల పవళిస్తా
అనురాగము అను రాగమునే ఆలపించి నిను లాలిస్తా
అనురాగము అను రాగమునే ఆలపించి నిను లాలిస్తా
నీలో నాలో నేనేలే... నీలో నాలో నేనేలే
మనలో మమతే చిరంజీవిలే
ప్రేమకు రూపం మనమేలే.. ఏ..
ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..
చరణం 3:
నీ సిగ విరజాజినై.. నీ యెద నెలరాజునై
నీ నగవుల రాశినై.. నీ మగసిరి దాసినై
నీవూ నేనూ.. నిజమై రుజువై
నీవూ నేనూ.. నిజమై రుజువై
ఎన్ని యుగాలుగ ఉన్నామూ..
ఎన్ని జన్మలు కన్నామో.. ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..
pallavi:
īnāḍi ī baṁdhamenāḍido
enāḍu pĕnavesi muḍi vesĕno.. o..o..
īnāḍi ī baṁdhamenāḍido
enāḍu pĕnavesi muḍi vesĕno.. o..o..
īnāḍi ī baṁdhamenāḍido.. o..o..
saraṇaṁ 1:
sukkalu pŏdigina āgāśhaṁ makkuvalŏlige managosaṁ
sukkalu pŏdigina āgāśhaṁ makkuvalŏlige managosaṁ
maṁchudĕralalo mallĕlado..o paṁdiri maṁchaṁ vesiṁdi
maṁchudĕralalo mallĕlado..o paṁdiri maṁchaṁ vesiṁdi
īnāḍi ī baṁdhamenāḍido.. o..o..
saraṇaṁ 2:
nī kanubābala ūyalalo.. ne pasibābala pavaḽistā.. ā..ā..
nī kanubābala ūyalalo.. ne pasibābala pavaḽistā
anurāgamu anu rāgamune ālabiṁchi ninu lālistā
anurāgamu anu rāgamune ālabiṁchi ninu lālistā
nīlo nālo nenele... nīlo nālo nenele
manalo mamade siraṁjīvile
premagu rūbaṁ manamele.. e..
īnāḍi ī baṁdhamenāḍido.. o..o..
saraṇaṁ 3:
nī siga virajājinai.. nī yĕda nĕlarājunai
nī nagavula rāśhinai.. nī magasiri dāsinai
nīvū nenū.. nijamai rujuvai
nīvū nenū.. nijamai rujuvai
ĕnni yugāluga unnāmū..
ĕnni janmalu kannāmo.. o..
īnāḍi ī baṁdhamenāḍido
enāḍu pĕnavesi muḍi vesĕno.. o..o..
īnāḍi ī baṁdhamenāḍido.. o..o..