Edo priyaraagam vimtunnaa

ఏదో ప్రియరాగం వింటున్నా
Work
Year
Language

పల్లవి:

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా ఆ సందడి నీదేనా
ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో ప్రేమా ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైనా ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నా వెంటే
నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంతా ఏదో తియ్యని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం

చరణం 1:

ఓ పాట పాడదా మౌనం పురి విప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూతోట చేయదా ప్రేమ బాటలో పయనం
దారి చూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం
ఎల్ల దాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిత్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం
నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం
నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతి మాట వేదం నువ్వుంటే ప్రతి పలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం

చరణం 2:

ఓ ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుతున్నానా
చెలియ లోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపానా
ఆమె లోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయానా
హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే
సిరిమల్లెలా వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా
నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటే మరి మాటలు కూడా పాటై పోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే

pallavi:

edo priyarāgaṁ viṁṭunnā sirunavvullo premā ā saṁdaḍi nīdenā
edo navanāṭyaṁ sūstunnā sirimuvvallo premā ā savvaḍi nīdenā
iṭṭāge kalagālaṁ sūḍālanuguṁṭunnā
iḍubainā ī svapnaṁ karigiṁchagu emainā
premā o premā siragālaṁ nā vĕṁṭe
nuvvuṁṭe nijamegā svapnaṁ nuvvuṁṭe pradi māḍa satyaṁ
nuvvuṁṭe manasaṁtā edo tiyyani saṁgīdaṁ
nuvvuṁṭe pradi aḍugu aṁdaṁ nuvvuṁṭe pradi kṣhaṇamu svargaṁ
nuvvuṁṭe iga jīvidamaṁtā edo saṁtoṣhaṁ

saraṇaṁ 1:

o pāḍa pāḍadā maunaṁ puri vippi āḍadā prāṇaṁ
aḍavinaina pūdoḍa seyadā prema bāḍalo payanaṁ
dāri sūbadā śhūnyaṁ araseda vāladā svargaṁ
ĕlla dāḍi paravaḽḽu tŏkkadā vĕlluvaina ānaṁdaṁ
premā nī sāvāsaṁ nā śhvāsagu saṁgīdaṁ
premā nī sānnityaṁ nā ūhala sāmrājyaṁ
premā o premā guṁḍĕllo kalagālaṁ
nuvvuṁṭe pradi āśha sŏṁtaṁ nuvvuṁṭe sirugāle gaṁdhaṁ
nuvvuṁṭe ĕṁḍainā kādā sallani sāyaṁtraṁ
nuvvuṁṭe pradi māḍa vedaṁ nuvvuṁṭe pradi palugu rāgaṁ
nuvvuṁṭe sirunavvuladone niṁḍĕnu ī logaṁ

saraṇaṁ 2:

o unnasoḍa unnānā āgāśhamaṁdudunnānā
sĕliya loni ī kŏtta saṁbaraṁ nāgu rĕkka tŏḍigenā
munigi teludunnānā ī muchchaḍaina muribānā
āmĕ loni ānaṁda sāgaraṁ nannu muṁchu samayānā
hariville nannalle ī raṁgulu nīvalle
sirimallĕlā vāgalle ī vĕnnĕla nīvalle
premā o premā idi śhāśhvadamanugonā
nuvvuṁṭe digulaṁṭū rāde nuvvuṁṭe vĕlugaṁṭū pode
nuvvuṁṭe mari māḍalu kūḍā pāḍai podāye
nuvvuṁṭe ĕduraṁṭū lede nuvvuṁṭe alubaṁṭū rāde
nuvvuṁṭe e kaṣhṭālainā ĕṁto iṣhṭāle