Edo aasha edalo modalainadi ebudoo jaada lenidi

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది
Year
Language

పల్లవి:

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది
నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది
ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది ..నిశీధిలో ఉషోదయంలా..
ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది...ఎపుడూ జాడ లేనిది...

చరణం 1:

నీ లాలిని పాడే లాలన నేనోయ్
జాబిలికై ఆశ పడే బాలను నేను
తల్లిగా జోకొట్టి చలువే పంచాలోయ్
చెల్లిగా చేపట్టి చనువే పంచాలోయ్
సరిగా నాకే ఇంకా తేలని ఈవేళ....

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది
నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది....

చరణం 2:

నీ నీలి కనుల్లో వెతుకుతు ఉన్నా
క్షణానికో రూపంలో కనబడుతున్నా
జాడవై నావెంట నిను నడిపించాలోయ్
జానకై జన్మంతా జంటగా నడవాలోయ్
తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీల....

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది
నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది
ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది ..నిశీధిలో ఉషోదయంలా..

pallavi:

edo āśha ĕdalo mŏdalainadi ĕbuḍū jāḍa lenidi
nijaṁ tĕlusā īnāḍidi kādadi ibuḍe melugunnadi
ilā nī śhvāsa gilli lĕmmaṁṭū nannalluguṁdi ..niśhīdhilo uṣhodayaṁlā..
edo āśha ĕdalo mŏdalainadi ĕbuḍū jāḍa lenidi...ĕbuḍū jāḍa lenidi...

saraṇaṁ 1:

nī lālini pāḍe lālana nenoy
jābiligai āśha paḍe bālanu nenu
talligā jogŏṭṭi saluve paṁchāloy
sĕlligā sebaṭṭi sanuve paṁchāloy
sarigā nāge iṁkā telani īveḽa....

edo āśha ĕdalo mŏdalainadi ĕbuḍū jāḍa lenidi
nijaṁ tĕlusā īnāḍidi kādadi ibuḍe melugunnadi....

saraṇaṁ 2:

nī nīli kanullo vĕdugudu unnā
kṣhaṇānigo rūbaṁlo kanabaḍudunnā
jāḍavai nāvĕṁṭa ninu naḍibiṁchāloy
jānagai janmaṁtā jaṁṭagā naḍavāloy
tĕlisī tĕlīnaṭṭe uṁdī ī līla....

edo āśha ĕdalo mŏdalainadi ĕbuḍū jāḍa lenidi
nijaṁ tĕlusā īnāḍidi kādadi ibuḍe melugunnadi
ilā nī śhvāsa gilli lĕmmaṁṭū nannalluguṁdi ..niśhīdhilo uṣhodayaṁlā..