E raagamo

ఏ రాగమో
Year
Language

పల్లవి:

ఏ రాగమో.. ఇది ఏ తాళమో..
ఏ రాగమో.. ఇది ఏ తాళమో
అనురాగాని కనువైన శృతి కలిపినాము
ఆఁహాఁ.. ఊఁహూఁ.. ఆఁహాఁ.. ఉఁహూఁ

ఏ రాగమో.. ఇది ఏ తాళమో
ఏ రాగమో.. ఇది ఏ తాళమో
మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో..
ఇది ఏ తాళమో..

చరణం 1:

ఎదలో మెదిలే సంగతులన్నీ.. పలికెను సంగీతమై..ఈ..
పలికెను సంగీతమై..

కలిసిన కన్నుల మెరిసేకలలే.. వెలిసెను గమకములై..ఈ..
వెలిసెను గమకములై..

హొయలైన నడకలే లయలైనవవవి..
చతురాడు నవ్వులే గతులైనవి..
సరిసరి అనగానే మరిమరి కొసరాడు
మురిపాలె మనజంట స్వరమైనది..

ఏ రాగమో.. ఇది ఏ తాళమో
మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో..
ఇది ఏ తాళమో..

చరణం 2:

విరికన్నె తనకు పరువమే కాదు.. పరువూ కలదన్నది..ఈ..
పరువు కలదన్నది..

భ్రమరము తనకు అనుభవమే కాదు.. అనుబంధమున్నది...ఈ..
అనుబంధమున్నది..

కోకిలమ్మ గుండెకు గొంతున్నది..
కొమ్మలో దానికి గూడున్నది..
సరిమగవానికి సగమని తలపోయు
మనజంటకే జంటసరి ఉన్నది..

ఏ రాగమో.. ఇది ఏ తాళమో
అనురాగాని కనువైన శృతి కలిపినాము
ఏ రాగమో..
ఇది ఏ తాళమో..

pallavi:

e rāgamo.. idi e tāḽamo..
e rāgamo.. idi e tāḽamo
anurāgāni kanuvaina śhṛti kalibināmu
ām̐hām̐.. ūm̐hūm̐.. ām̐hām̐.. um̐hūm̐

e rāgamo.. idi e tāḽamo
e rāgamo.. idi e tāḽamo
mana kaḽyāṇa śhubhaveḽa mogiṁchu meḽamo
e rāgamo..
idi e tāḽamo..

saraṇaṁ 1:

ĕdalo mĕdile saṁgadulannī.. paligĕnu saṁgīdamai..ī..
paligĕnu saṁgīdamai..

kalisina kannula mĕrisegalale.. vĕlisĕnu gamagamulai..ī..
vĕlisĕnu gamagamulai..

hŏyalaina naḍagale layalainavavavi..
sadurāḍu navvule gadulainavi..
sarisari anagāne marimari kŏsarāḍu
muribālĕ manajaṁṭa svaramainadi..

e rāgamo.. idi e tāḽamo
mana kaḽyāṇa śhubhaveḽa mogiṁchu meḽamo
e rāgamo..
idi e tāḽamo..

saraṇaṁ 2:

virigannĕ tanagu paruvame kādu.. paruvū kaladannadi..ī..
paruvu kaladannadi..

bhramaramu tanagu anubhavame kādu.. anubaṁdhamunnadi...ī..
anubaṁdhamunnadi..

kogilamma guṁḍĕgu gŏṁtunnadi..
kŏmmalo dānigi gūḍunnadi..
sarimagavānigi sagamani talaboyu
manajaṁṭage jaṁṭasari unnadi..

e rāgamo.. idi e tāḽamo
anurāgāni kanuvaina śhṛti kalibināmu
e rāgamo..
idi e tāḽamo..