E janmado ee sambamdhamoo

ఏ జన్మదో ఈ సంబంధమూ
Work
Year
Language

పల్లవి:

ఆహహా లాలలా
లల లల లల లల లలలా
ఆహహా లాలలా
లల లల లల లల లా హా

ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగమో ఈ సంగీతమూ
మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధమూ

చరణం 1:

ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం
పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం
మా ఇంటిలోన పాదం పలికించె ప్రేమ వేదం
అందాల గుడిలోన పూజారినో ఓ బాటసారినో
ఏ జన్మదో ఈ సంబంధమూ

చరణం 2:

లతలు రెండూ విరులు ఆరై విరిసె బృందావనీ
కలలు పండీ వెలుగులాయే కలిసి ఉందామనీ
వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై
హేమంత సిగ్గులొలికీ కవ్వింతలాయె కళకే
ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోటమాలిదో

ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగమో ఈ సంగీతమూ
మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధమూ

pallavi:

āhahā lālalā
lala lala lala lala lalalā
āhahā lālalā
lala lala lala lala lā hā

e janmado ī saṁbaṁdhamū
e rāgamo ī saṁgīdamū
manase kore māṁgalyaṁ
tanuve paṁḍe tāṁbūlaṁ ī prema yātralo
e janmado ī saṁbaṁdhamū

saraṇaṁ 1:

ŏgari kosaṁ ŏgaru sūbe mamada ī kāburaṁ
siguru vese silibi svārdhaṁ valabu maunākṣharaṁ
pĕḽḽāḍugunna aṁdaṁ vĕyyeḽḽa tībi baṁdhaṁ
mā iṁṭilona pādaṁ paligiṁchĕ prema vedaṁ
aṁdāla guḍilona pūjārino o bāḍasārino
e janmado ī saṁbaṁdhamū

saraṇaṁ 2:

ladalu rĕṁḍū virulu ārai virisĕ bṛṁdāvanī
kalalu paṁḍī vĕlugulāye kalisi uṁdāmanī
vesaṁgi mallĕ silage sīdaṁgi veḽa sinugai
hemaṁta siggulŏligī kavviṁtalāyĕ kaḽage
ī pūla ṛtuvaṁta ā teḍido ī toḍamālido

e janmado ī saṁbaṁdhamū
e rāgamo ī saṁgīdamū
manase kore māṁgalyaṁ
tanuve paṁḍe tāṁbūlaṁ ī prema yātralo
e janmado ī saṁbaṁdhamū