పల్లవి:
ఏ గీత గీసినా... నీ రూపమే...
ఏ గీత గీసినా... నీ రూపమే...
ఏ గీతి పాడినా... నీ గానమే....
రతివో... భారతివో... అనురాగవతివో..
ఎవరివో... ఎవరివో... నీవెవరివో...
ఏ గీత గీసినా... నీ రూపమే...
చరణం 1:
దివి నుండి వచ్చిన దేవతవో... భువిలోన వెలసిన మోహినివో..
మిసమిస అందాల రసరాగ లతవో... అసమాన లావణ్య కుసుమానివో...
ఎవరివో... ఎవరివో... నీవెవరివో...
ఏ గీత గీసినా... నీ రూపమే...
చరణం 2:
కాళిదాసుని దివ్య కావ్యనాయికవో... కణ్వముని కనువెలుగు శకుంతలవో..
మధుమాస శుభవేళ మాధవుని రాకకై...
మధుమాస శుభవేళ మాధవుని రాకకై... ఎదురుతెన్నులు చూచు రాధికవో...
ఏ గీత గీసినా...నీ రూపమే...
చరణం 3:
అజంతా గుహలోని చిత్రానివో... అమరావతి సీమ శిల్పానివో..
రామప్ప గుడిలోన రమణీయ భంగిమల.. రక్తినొలికించే నర్తన బాలవో...
ఎవరివో... ఎవరివో... నీవెవరివో...
ఏ గీత గీసినా... నీ రూపమే...
pallavi:
e gīda gīsinā... nī rūbame...
e gīda gīsinā... nī rūbame...
e gīdi pāḍinā... nī gāname....
radivo... bhāradivo... anurāgavadivo..
ĕvarivo... ĕvarivo... nīvĕvarivo...
e gīda gīsinā... nī rūbame...
saraṇaṁ 1:
divi nuṁḍi vachchina devadavo... bhuvilona vĕlasina mohinivo..
misamisa aṁdāla rasarāga ladavo... asamāna lāvaṇya kusumānivo...
ĕvarivo... ĕvarivo... nīvĕvarivo...
e gīda gīsinā... nī rūbame...
saraṇaṁ 2:
kāḽidāsuni divya kāvyanāyigavo... kaṇvamuni kanuvĕlugu śhaguṁtalavo..
madhumāsa śhubhaveḽa mādhavuni rāgagai...
madhumāsa śhubhaveḽa mādhavuni rāgagai... ĕdurudĕnnulu sūsu rādhigavo...
e gīda gīsinā...nī rūbame...
saraṇaṁ 3:
ajaṁtā guhaloni sitrānivo... amarāvadi sīma śhilbānivo..
rāmappa guḍilona ramaṇīya bhaṁgimala.. raktinŏligiṁche nardana bālavo...
ĕvarivo... ĕvarivo... nīvĕvarivo...
e gīda gīsinā... nī rūbame...