పల్లవి:
ధిన్ ధినక్తరి నక్తిక్ తోం ధిన్ ధినక్తరి నక్తిక్ తోం
ధిన్ ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం
గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో గడిపేయ్యడమే కదా ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కద సంతోషం
ధిన్ ధినక్తరి నక్తిక్ తోం ధిన్ ధినక్తరి నక్తిక్ తోం
ధిన్ ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం
చరణం 1:
అమ్మాయిల చేతలకి కుర్రాళ్ళ కూతలకి
హద్దంటూ లేదయ్యో ఈ దినం
సందంట్లొ సందయ్యో పెళ్ళవని జంటలకి
ఆనందం అందించే ఈ క్షణం
పేకాట రాయుళ్ళ చేజొరు చూడాలి ఈ పెళ్ళి లోగిళ్ళలో
మందేసి చిందేసి అల్లర్లు చేసేరు కుర్రాళ్ళు విడిదింటిలో
కన్నె పిల్లలకు బ్రహ్మచారులకు కొంటె సైగలే ఇష్టమంట
ధిన్ ధినక్తరి నక్తిక్ తోం ధిన్ ధినక్తరి నక్తిక్ తోం
ధిన్ ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం
గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
చరణం 2:
ఈ పెళ్ళి పందిరిలో సరదాల సందడిలో
ఈ నేలకొచిందయ్యొ అంబరం
ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా
ఈ ఇంట జరగాలయ్యొ సంబరం
వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేటి ఈ వేళలో
అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేద మంత్రాలలో
కన్నెదాతకి అప్పగింతలు కంటితుడుపులు తప్పవంట
హే ధిన్ ధినక్తరి నక్తిక్ తోం ధిన్ ధినక్తరి నక్తిక్ తోం
ధిన్ ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం
గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో గడిపేయ్యడమే కదా ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం
ధిన్ ధినక్తరి నక్తిక్ తోం ధిన్ ధినక్తరి నక్తిక్ తోం
ధిన్ ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం
ధిన్ ధినక్తరి నక్తిక్ తోం ధిన్ ధినక్తరి నక్తిక్ తోం
ధిన్ ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం
pallavi:
dhin dhinaktari naktik toṁ dhin dhinaktari naktik toṁ
dhin dhinaktari naktik naktik toṁ
guppĕḍaṁta guṁḍĕllo sĕppaleni ānaṁdaṁ
ī kṣhaṇāle ĕṁto saṁtoṣhaṁ
jīvidaṁ sirunavvudo gaḍibeyyaḍame kadā ānaṁdaṁ
aṁdaraṁ manamaṁdaraṁ kalisuṁṭene kada saṁtoṣhaṁ
dhin dhinaktari naktik toṁ dhin dhinaktari naktik toṁ
dhin dhinaktari naktik naktik toṁ
saraṇaṁ 1:
ammāyila sedalagi kurrāḽḽa kūdalagi
haddaṁṭū ledayyo ī dinaṁ
saṁdaṁṭlŏ saṁdayyo pĕḽḽavani jaṁṭalagi
ānaṁdaṁ aṁdiṁche ī kṣhaṇaṁ
pegāḍa rāyuḽḽa sejŏru sūḍāli ī pĕḽḽi logiḽḽalo
maṁdesi siṁdesi allarlu seseru kurrāḽḽu viḍidiṁṭilo
kannĕ pillalagu brahmasārulagu kŏṁṭĕ saigale iṣhṭamaṁṭa
dhin dhinaktari naktik toṁ dhin dhinaktari naktik toṁ
dhin dhinaktari naktik naktik toṁ
guppĕḍaṁta guṁḍĕllo sĕppaleni ānaṁdaṁ
ī kṣhaṇāle ĕṁto saṁtoṣhaṁ
saraṇaṁ 2:
ī pĕḽḽi paṁdirilo saradāla saṁdaḍilo
ī nelagŏsiṁdayyŏ aṁbaraṁ
ī ūru vāḍaṁtā pŏṁgiboyelāgā
ī iṁṭa jaragālayyŏ saṁbaraṁ
vevela janmāla puṇyāla phalidālu sereḍi ī veḽalo
akṣhiṁtale neḍu lakṣhiṁtalayyāyi ī veda maṁtrālalo
kannĕdādagi appagiṁtalu kaṁṭiduḍubulu tappavaṁṭa
he dhin dhinaktari naktik toṁ dhin dhinaktari naktik toṁ
dhin dhinaktari naktik naktik toṁ
guppĕḍaṁta guṁḍĕllo sĕppaleni ānaṁdaṁ
ī kṣhaṇāle ĕṁto saṁtoṣhaṁ
jīvidaṁ sirunavvudo gaḍibeyyaḍame kadā ānaṁdaṁ
aṁdaraṁ manamaṁdaraṁ kalisuṁṭene kadā saṁtoṣhaṁ
dhin dhinaktari naktik toṁ dhin dhinaktari naktik toṁ
dhin dhinaktari naktik naktik toṁ
dhin dhinaktari naktik toṁ dhin dhinaktari naktik toṁ
dhin dhinaktari naktik naktik toṁ