Devudu karunistaadani varamulu kuribis

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్
Year
Language

పల్లవి:

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే వినీ
నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు
ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈపైనా కడ దాక సాగనా

చరణం 1:

నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం
నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగ నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
ఇదే మాట గుండెల్లో సదా మోగుతోంది
నేనే నీకోసం నువ్వే నాకోసం ఎవరేమి అనుకున్నా

చరణం 2:

ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళవరకు
మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకు
ఎటెళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదా నువ్వే రాకపోతే
నువ్వు నీ నవ్వూ నాతో లేకుంటే నేనంటు ఉంటానా

pallavi:

devuḍu karuṇistāḍani varamulu kuribistāḍani
nammaledu nāgu nī preme dŏrige varagu
svargaṁ ŏgaḍuṁṭuṁdani aṁtā aṁṭuṁṭe vinī
nammaledu nenu nī nīḍagu serevaragu
ŏgarigi ŏgarani muṁduga rāse unnado
manasuna manasai baṁdhaṁ vese unnado
emo emainā nīdo ībainā kaḍa dāga sāganā

saraṇaṁ 1:

nuvvu uṁṭene uṁdi nā jīvidaṁ ī māḍa satyaṁ
nuvvu jaṁṭaide bradugulo pradi kṣhaṇaṁ sukhamega nityaṁ
pade pade nī pere pĕdavi palavaristoṁdi
ide māḍa guṁḍĕllo sadā mogudoṁdi
nene nīgosaṁ nuvve nāgosaṁ ĕvaremi anugunnā

saraṇaṁ 2:

premane māḍagardhame tĕliyadu innāḽḽavaragu
manasulo unna alajaḍe tĕliyadu ninu sere varagu
ĕḍĕḽḽedo jīvidaṁ nuvve legabode
ĕḍārigā māredā nuvve rāgabode
nuvvu nī navvū nādo leguṁṭe nenaṁṭu uṁṭānā