Devude digi vachchinaa svargame naagich

దేవుడే దిగి వచ్చినా స్వర్గమే నాకిచ్
Work
Year
Language

పల్లవి:

దేవుడే దిగి వచ్చినా స్వర్గమే నాకిచ్చినా
షాజహాన్ తిరిగొచ్చినా తాజ్‌మహల్ రాసిచ్చినా
ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే

చరణం 1:

వెన్నెలా చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం
నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకసం
ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం
ఎప్పుడూ ముందరెప్పుడూ చూడలేదిలా దీని వాలకం
ప్రేమొస్తే ఇంతేనేమో పాపం
దాసోహం అంటుందేమో వంగి వంగి ఈ లోకం

చరణం 2:

కోయిలా నేర్చుకో ఇలా ఆమె నవ్వులో తేనె సంతకం
హాయిగా పీల్చుకో ఇలా చల్ల గాలిలో ఆమె పరిమళం
నీటిపై చందమామలా నేడు తేలుతూ ఉంది నా మది
చీటికీ మాటి మాటికీ కొత్త కొత్తగా ఉంది ఏమది
అణువంతే ఉంటుందమ్మా ప్రేమా
అణచాలి అనుకున్నామా చేస్తుందమ్మా హంగామా

దేవుడే దిగి వచ్చినా స్వర్గమే నాకిచ్చినా
షాజహాన్ తిరిగొచ్చినా తాజ్‌మహల్ రాసిచ్చినా
ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే

pallavi:

devuḍe digi vachchinā svargame nāgichchinā
ṣhājahān dirigŏchchinā tāj‌mahal rāsichchinā
ippuḍī saṁtoṣhaṁ muṁdara sinnabodāyi annī kadarā
lolona manasaṁtā saṁtoṣhame
ī prema pulagiṁta saṁtoṣhame
lolona manasaṁtā saṁtoṣhame
ī prema pulagiṁta saṁtoṣhame

saraṇaṁ 1:

vĕnnĕlā sūḍu nannilā ĕṁta hāyigā uṁdi ī dinaṁ
nammavā nannu nammavā sedigaṁdudū uṁdi āgasaṁ
ippuḍe puṭṭinaṭṭugā ĕṁta bujjigā uṁdi bhūdalaṁ
ĕppuḍū muṁdarĕppuḍū sūḍaledilā dīni vālagaṁ
premŏste iṁtenemo pābaṁ
dāsohaṁ aṁṭuṁdemo vaṁgi vaṁgi ī logaṁ

saraṇaṁ 2:

koyilā nersugo ilā āmĕ navvulo tenĕ saṁtagaṁ
hāyigā pīlsugo ilā salla gālilo āmĕ parimaḽaṁ
nīḍibai saṁdamāmalā neḍu teludū uṁdi nā madi
sīḍigī māḍi māḍigī kŏtta kŏttagā uṁdi emadi
aṇuvaṁte uṁṭuṁdammā premā
aṇasāli anugunnāmā sestuṁdammā haṁgāmā

devuḍe digi vachchinā svargame nāgichchinā
ṣhājahān dirigŏchchinā tāj‌mahal rāsichchinā
ippuḍī saṁtoṣhaṁ muṁdara sinnabodāyi annī kadarā
lolona manasaṁtā saṁtoṣhame
ī prema pulagiṁta saṁtoṣhame
lolona manasaṁtā saṁtoṣhame
ī prema pulagiṁta saṁtoṣhame