Deebaanigi kiranam aabharanam

దీపానికి కిరణం ఆభరణం
Year
Language

పల్లవి:

ఉమ్.. ఊఁ.. ఆ.. ఆ..

దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి.. ఏనాటికీ.. తరగని సుగుణం.. ఆభరణం
తరగని సుగుణం.. ఆభరణం

దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం

చరణం 1:

నిండుగ పారే యేరు.. తన నీటిని తానే తాగదు
జగతిని చూపే కన్ను.. తన ఉనికిని తానే చూడదు
పరుల కోసం.. బ్రతికే మనిషి..
పరుల కోసం బ్రతికే మనిషి.. తన బాగు తానే కోరడు..
తన బాగు తానే కోరడు..

దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం

చరణం 2:

తాజమహలులో కురిసే వెన్నెల.. పూరి గుడిసెపై కురియదా
బృందావనిలో విరిసే మల్లియ.. పేద ముంగిట విరియదా
మంచితనము పంచేవారికి..
మంచితనము పంచేవారికి.. అంతరాలతో పని ఉందా..
అంతరాలతో పని ఉందా..

దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి.. ఏనాటికీ.. తరగని సుగుణం.. ఆభరణం
తరగని సుగుణం.. ఆభరణం

చరణం 3:

వెలుగున ఉన్నంత వరకే.. నీ నీడ తోడుగా ఉంటుంది
చీకటిలో నీవు సాగితే.. అది నీకు దూరమవుతుంది
ఈ పరమార్థం తెలిసిన నాడే..
ఈ పరమార్థం తెలిసిన నాడే.. బ్రతుకు సార్థకమౌతుంది..
బ్రతుకు సార్థకమౌతుంది..

దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి.. ఏనాటికీ.. తరగని సుగుణం.. ఆభరణం
తరగని సుగుణం.. ఆభరణం

pallavi:

um.. ūm̐.. ā.. ā..

dībānigi kiraṇaṁ ābharaṇaṁ.. rūbānigi hṛdayaṁ ābharaṇaṁ
hṛdayānigi.. enāḍigī.. taragani suguṇaṁ.. ābharaṇaṁ
taragani suguṇaṁ.. ābharaṇaṁ

dībānigi kiraṇaṁ ābharaṇaṁ.. rūbānigi hṛdayaṁ ābharaṇaṁ

saraṇaṁ 1:

niṁḍuga pāre yeru.. tana nīḍini tāne tāgadu
jagadini sūbe kannu.. tana unigini tāne sūḍadu
parula kosaṁ.. bradige maniṣhi..
parula kosaṁ bradige maniṣhi.. tana bāgu tāne koraḍu..
tana bāgu tāne koraḍu..

dībānigi kiraṇaṁ ābharaṇaṁ.. rūbānigi hṛdayaṁ ābharaṇaṁ

saraṇaṁ 2:

tājamahalulo kurise vĕnnĕla.. pūri guḍisĕbai kuriyadā
bṛṁdāvanilo virise malliya.. peda muṁgiḍa viriyadā
maṁchidanamu paṁchevārigi..
maṁchidanamu paṁchevārigi.. aṁtarālado pani uṁdā..
aṁtarālado pani uṁdā..

dībānigi kiraṇaṁ ābharaṇaṁ.. rūbānigi hṛdayaṁ ābharaṇaṁ
hṛdayānigi.. enāḍigī.. taragani suguṇaṁ.. ābharaṇaṁ
taragani suguṇaṁ.. ābharaṇaṁ

saraṇaṁ 3:

vĕluguna unnaṁta varage.. nī nīḍa toḍugā uṁṭuṁdi
sīgaḍilo nīvu sāgide.. adi nīgu dūramavuduṁdi
ī paramārdhaṁ tĕlisina nāḍe..
ī paramārdhaṁ tĕlisina nāḍe.. bradugu sārdhagamauduṁdi..
bradugu sārdhagamauduṁdi..

dībānigi kiraṇaṁ ābharaṇaṁ.. rūbānigi hṛdayaṁ ābharaṇaṁ
hṛdayānigi.. enāḍigī.. taragani suguṇaṁ.. ābharaṇaṁ
taragani suguṇaṁ.. ābharaṇaṁ