Bugga gilla gaane sariboyimdaa

బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
Year
Language

పల్లవి:

బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోయిందా
బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోయిందా

కోరుకున్న చిన్న దాన్ని గుండెలోన ఏముందో
కొంచెమైన తెలుసుకున్నావా ఆ ఆ ఆ...

బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు
బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు

నీ కొంగు నా కొంగు ఏకంగా ముడి వేసే
వేళ కోసం వేచి ఉన్నాను ఊ ఊ ఊ....

బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు

చరణం 1:

ముత్యాల పందిరి వేసి..రత్నాల పీట వేసి
బంగారు చేతులతో... బాసికం కడతావా...

మనసే ఒక పందిరి చేసి మమతలనే పీట వేసి
మురిపించే చేతులతో..మూడు ముళ్ళు వేస్తానే..
నీ జోడు కూడి వస్తానే...

బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు

చరణం 2:

కన్నె పిల్ల వలపంటే..వెన్నపూస లాంటిది
కాస్త వేడి సోకిందా... కరిగి పోతానంటదీ...

చల చల్లని కళ్ళల్లో..మెల మెల్లగా దాచుకుంటే
వెన్న లాంటి ఆ వలపే..వేడి తగలకుంటదీ..
నా నీడ లాగ ఉంటదీ...

బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే అయిపోయిందా

బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి గిలి నవ్వగానే అయిపోలేదు

pallavi:

bugga gilla gāne sariboyiṁdā
gili gili gili gili navvagāne sariboyiṁdā
bugga gilla gāne sariboyiṁdā
gili gili gili gili navvagāne sariboyiṁdā

korugunna sinna dānni guṁḍĕlona emuṁdo
kŏṁchĕmaina tĕlusugunnāvā ā ā ā...

bugga gilla gāne sariboledu
gili gili gili gili navvagāne sariboledu
bugga gilla gāne sariboledu
gili gili gili gili navvagāne sariboledu

nī kŏṁgu nā kŏṁgu egaṁgā muḍi vese
veḽa kosaṁ vesi unnānu ū ū ū....

bugga gilla gāne sariboledu
gili gili gili navvagāne sariboledu

saraṇaṁ 1:

mutyāla paṁdiri vesi..ratnāla pīḍa vesi
baṁgāru sedulado... bāsigaṁ kaḍadāvā...

manase ŏga paṁdiri sesi mamadalane pīḍa vesi
muribiṁche sedulado..mūḍu muḽḽu vestāne..
nī joḍu kūḍi vastāne...

bugga gilla gāne sariboyiṁdā
gili gili gili gili navvagāne sariboledu

saraṇaṁ 2:

kannĕ pilla valabaṁṭe..vĕnnabūsa lāṁṭidi
kāsta veḍi sogiṁdā... karigi podānaṁṭadī...

sala sallani kaḽḽallo..mĕla mĕllagā dāsuguṁṭe
vĕnna lāṁṭi ā valabe..veḍi tagalaguṁṭadī..
nā nīḍa lāga uṁṭadī...

bugga gilla gāne sariboyiṁdā
gili gili gili gili navvagāne ayiboyiṁdā

bugga gilla gāne sariboledu
gili gili gili gili navvagāne ayiboledu