Bommanu sesi praanamu posi

బొమ్మను చేసి ప్రాణము పోసి
Work
Year
Language

పల్లవి:

బ్రతుకంతా బాధగా ... కలలోని గాధగా
కన్నీటి ధారగా.. కరగిపోయే
తలచేది జరుగదు - జరిగేది తెలియదు
బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుకా(2)
గారడి చేసి గుండెను కోసి
నవ్వేవు ఈ వింత చాలిక.. (బొమ్మను)

చరణం 1:

అందాలు సృష్టించినావు దయతో నీవు
మరలా నీ చేతితో నీవె తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారాన విడిచేవులే
కొండంత ఆశ అడియాస చేసి పాతాళలోకాన త్రోసేవులే..(2) |||బొమ్మను|||

చరణం 2:

ఒకనాటి ఉద్యానవనము నేడు కనము
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే (2)
అనురాగమధువు అందించి నీవు హాలాహలజ్వాల చేసేవులే
ఆనందనౌక పయనించు వేళ శోకాల సంద్రాన ముంచేవులే .. |||బొమ్మను|||

pallavi:

bradugaṁtā bādhagā ... kalaloni gādhagā
kannīḍi dhāragā.. karagiboye
talasedi jarugadu - jarigedi tĕliyadu
bŏmmanu sesi prāṇamu posi
āḍevu nīgidi veḍugā(2)
gāraḍi sesi guṁḍĕnu kosi
navvevu ī viṁta sāliga.. (bŏmmanu)

saraṇaṁ 1:

aṁdālu sṛṣhṭiṁchināvu dayado nīvu
maralā nī sedido nīvĕ tuḍisevule
dībālu nīve vĕligiṁchināve gāḍhāṁdhagārāna viḍisevule
kŏṁḍaṁta āśha aḍiyāsa sesi pādāḽalogāna trosevule..(2) |||bŏmmanu|||

saraṇaṁ 2:

ŏganāḍi udyānavanamu neḍu kanamu
adiye marubhūmigā nīvu mārsevule (2)
anurāgamadhuvu aṁdiṁchi nīvu hālāhalajvāla sesevule
ānaṁdanauga payaniṁchu veḽa śhogāla saṁdrāna muṁchevule .. |||bŏmmanu|||