భలే మంచిరోజు... పసందైన రోజు..
పల్లవి:
భలే మంచిరోజు.. పసందైన రోజు..
వసంతాలు పూచే నేటిరోజు..ఆ..ఆయ్
వసంతాలు పూచే నేటిరోజు ||2||
చరణం 1:
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు ||2||
నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచినరోజు
చరణం 2:
చందమామ అందినరోజు బృందావని నవ్వినరోజు
తొలివలపులు చిలికినరోజు కులదైవం పలికిన రోజు ||2||
కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసినరోజు
pallavi:
bhale maṁchiroju.. pasaṁdaina roju..
vasaṁtālu pūse neḍiroju..ā..āy
vasaṁtālu pūse neḍiroju ||2||
saraṇaṁ 1:
guṁḍĕloni korigalannī guvvalugā ĕgisina roju
guvvalaina ā korigale gūḍilona serina roju ||2||
niṁgiloni aṁdālannī muṁgiḍilone nilisinaroju
saraṇaṁ 2:
saṁdamāma aṁdinaroju bṛṁdāvani navvinaroju
tŏlivalabulu siliginaroju kuladaivaṁ paligina roju ||2||
kannadalli āśhalannī sannajājulai virisinaroju