Aagaasham dimchaalaa nelavamka tumchaalaa

ఆకాశం దించాలా నెలవంక తుంచాలా
Year
Language

పల్లవి:

ఆకాశం దించాలా నెలవంక తుంచాలా
సిగలో ఉంచాలా... ఆ... ||2||

చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు సాలు
ఆకాశం నా నడుము నెలవంక నా నుదురు
సిగలో నువ్వేరా... ఆ... ఆ...

చరణం 1:

పట్టుతేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే... తెస్తానే...
మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే... తీస్తానే...

ఆ... పట్టుతేనె నీకన్నా తియ్యంగా వుంటుందా!
మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా!
అంతేనా అంతేనా...
అవును అంతేరా... ఆ...

ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా
కౌగిట్లో కరిగేరా... ఆ... ||2||

చరణం 2:

సూరీడు ఎర్రదనం సిందూరం చేస్తానే... చేస్తానే...
కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే... దిద్దేనే...

ఆ... నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూరీడు
నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు

అంతేనా అంతేనా...
అవును అంతేరా... ఆ...

మెరిసేటి చుక్కల్నీ మెడలోన చుట్టాలా
తలంబ్రాలు పొయ్యాలా
గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు

ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా
కౌగిట్లో కరిగేరా... ఆ...

pallavi:

āgāśhaṁ diṁchālā nĕlavaṁka tuṁchālā
sigalo uṁchālā... ā... ||2||

sĕkkili nuvvu nŏkkeḍappaḍi sakkali giṁtalu sālu
āgāśhaṁ nā naḍumu nĕlavaṁka nā nuduru
sigalo nuvverā... ā... ā...

saraṇaṁ 1:

paṭṭudenĕ tĕmmaṁṭe sĕṭṭĕkki tĕstāne... tĕstāne...
minnāgu maṇinainā puṭṭaloṁchi tīstāne... tīstāne...

ā... paṭṭudenĕ nīgannā tiyyaṁgā vuṁṭuṁdā!
minnāgu maṇigainā nī iluva vastuṁdā!
aṁtenā aṁtenā...
avunu aṁterā... ā...

āgāśhaṁ aṁchullo bhūdevi kaliselā
kaugiṭlo karigerā... ā... ||2||

saraṇaṁ 2:

sūrīḍu ĕrradanaṁ siṁdūraṁ sestāne... sestāne...
karimabbu nalladanaṁ kāḍuga diddene... diddene...

ā... nī ŏṁṭi vĕchchadanaṁ nannele sūrīḍu
nī kaṁṭi salladanaṁ nā nīḍa nā gūḍu

aṁtenā aṁtenā...
avunu aṁterā... ā...

mĕriseḍi sukkalnī mĕḍalona suṭṭālā
talaṁbrālu pŏyyālā
guṁḍĕlona guvvalāga kāburamuṁṭe sālu

āgāśhaṁ aṁchullo bhūdevi kaliselā
kaugiṭlo karigerā... ā...