Bhadram bee ker phul bredaroo

భద్రం బీ కేర్ ఫుల్ బ్రెదరూ
Work
Year
Language

పల్లవి:

భద్రం బీ కేర్ ఫుల్ బ్రెదరూ
భర్తగ మారకు బాచిలరూ
షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ ||2||
ఆలికి మెడలో ముళ్ళేశానని ఆనందించే మగవారూ
ఆ తాడే ఉరితాడన్నది ఆలోచించక చెడతారూ
మొగుడయ్యే ముహుర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టర్ ||భద్రం||

చరణం 1:

వంటకనీ వైఫెందుకురా హోటల్లే చాలు
వంటికనీ ఒకటా రెండా అంగడి అందాలూ
కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం
జంటలు కట్టే జంతువులడగవూ వెడ్డింగ్ విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం ||భద్రం||

చరణం 2:

చచ్చి చెడీ డే అండ్ నైటు చాకిరి చేస్తావూ
తెచ్చినదీ డార్లింగ్ అంటూ చేతిలో పోస్తావూ
బీడీ కోసం బీబీ ముందు దేహీ అంటావూ
గాడిని దాటని గానుగ ఎద్దై బతికేంచేస్తావూ
బాండెడ్ బానిసవవుతావూ ||భద్రం||

చరణం 3:

పులిలాగే పెళ్లికి కూడా లెటర్స్ రెండేరా
పర్వాలేదని పక్కకు వెళ్తే ఫలహారమైపోరా
ఈది అమీను సద్దాం హుస్సేను హిట్లర్ ఎట్సట్రా
ఇంట్లో ఉన్నా పెళ్లం కన్నా డిక్టేటర్లట్రా
అంతటి డిక్టేటర్లట్రా?

pallavi:

bhadraṁ bī ker phul brĕdarū
bhardaga māragu bāsilarū
ṣhādī māḍe vaddu gurū solo braduge so bĕḍarū ||2||
āligi mĕḍalo muḽḽeśhānani ānaṁdiṁche magavārū
ā tāḍe uridāḍannadi ālosiṁchaga sĕḍadārū
mŏguḍayye muhurdame magāḍi sukhāla mugiṁpu sāpṭar ||bhadraṁ||

saraṇaṁ 1:

vaṁṭaganī vaiphĕṁdugurā hoḍalle sālu
vaṁṭiganī ŏgaḍā rĕṁḍā aṁgaḍi aṁdālū
kodigi uṁdā koḍigi uṁdā ī pĕḽḽāsāraṁ
jaṁṭalu kaṭṭe jaṁtuvulaḍagavū vĕḍḍiṁk viḍḍūraṁ
ĕṁdugu managī grahasāraṁ ||bhadraṁ||

saraṇaṁ 2:

sachchi sĕḍī ḍe aṁḍ naiḍu sāgiri sestāvū
tĕchchinadī ḍārliṁk aṁṭū sedilo postāvū
bīḍī kosaṁ bībī muṁdu dehī aṁṭāvū
gāḍini dāḍani gānuga ĕddai badigeṁchestāvū
bāṁḍĕḍ bānisavavudāvū ||bhadraṁ||

saraṇaṁ 3:

pulilāge pĕḽligi kūḍā lĕḍars rĕṁḍerā
parvāledani pakkagu vĕḽte phalahāramaiborā
īdi amīnu saddāṁ hussenu hiṭlar ĕṭsaṭrā
iṁṭlo unnā pĕḽlaṁ kannā ḍikṭeḍarlaṭrā
aṁtaḍi ḍikṭeḍarlaṭrā?