Bhaarada maadagu jejelu

భారత మాతకు జేజేలు
Year
Language

పల్లవి:

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

చరణం 1:

త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
...నాల్గు వేదములు పుట్టిన భూమి
త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

చరణం 2:

శాంతిదూతగా వెలసిన బాపూ... జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు …
విప్లవ వీరులు వీర మాతలు …
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

చరణం 3:

సహజీవనము సమభావనము సమతా వాదము వేదముగా
..సమతా వాదము వేదముగా
సహజీవనము సమభావనము సమతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి
....లక్ష్యములైన విలక్షణ భూమి

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

pallavi:

bhārada mādagu jejelu baṁgaru bhūmigi jejelu
bhārada mādagu jejelu baṁgaru bhūmigi jejelu
āsedu himāsala sasyaśhyāmala jīvadhātrigi jejelu
āsedu himāsala sasyaśhyāmala jīvadhātrigi jejelu
bhārada mādagu jejelu baṁgaru bhūmigi jejelu

saraṇaṁ 1:

triveṇi saṁgama pavitrabhūmi nālgu vedamulu puṭṭina bhūmi
...nālgu vedamulu puṭṭina bhūmi
triveṇi saṁgama pavitrabhūmi nālgu vedamulu puṭṭina bhūmi
gīdāmṛtamunu paṁchina bhūmi paṁchaśhīla bodhiṁchina bhūmi
paṁchaśhīla bodhiṁchina bhūmi
bhārada mādagu jejelu baṁgaru bhūmigi jejelu

saraṇaṁ 2:

śhāṁtidūdagā vĕlasina bābū... jādi ratnamai vĕligina vĕhrū
śhāṁtidūdagā vĕlasina bābū jādi ratnamai vĕligina vĕhrū
viplava vīrulu vīra mādalu …
viplava vīrulu vīra mādalu …
muddubiḍḍalai murise bhūmi ..

bhārada mādagu jejelu baṁgaru bhūmigi jejelu

saraṇaṁ 3:

sahajīvanamu samabhāvanamu samadā vādamu vedamugā
..samadā vādamu vedamugā
sahajīvanamu samabhāvanamu samadā vādamu vedamugā
prajā kṣhemamu pragadi mārgamu lakṣhyamulaina vilakṣhaṇa bhūmi
....lakṣhyamulaina vilakṣhaṇa bhūmi

bhārada mādagu jejelu baṁgaru bhūmigi jejelu
āsedu himāsala sasyaśhyāmala jīvadhātrigi jejelu
bhārada mādagu jejelu baṁgaru bhūmigi jejelu