Baby he loves you

Baby he loves you
Work
Year
Language

పల్లవి:

ఛా... వాడికి నా మీద ప్రేమే లేదు
He doesn't love me you know
NO..
He loves you... he loves you so much

అవునా....ఎంత?

ఊఁ... ఎంతంటే... ఆ...

మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంత
మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంతా
మొదటి సారి నీకు ముద్దుపెట్టినప్పుడు జరిగినట్టి దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినపుడు తీరినట్టి భారమంత

ఓ... ఇంకా..

చరణం 1:

ఓ... తెల్ల తెల్లవారి పల్లెటూరులోన అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత
ఓ...చల్ల బువ్వలోన నంచుకుంటు తిన్న ఆవకాయ కారమంత
పెళ్ళి ఈడుకొచ్చి తుళ్ళి అడుతున్న ఆడపిల్ల కోరికంత

Baby he loves you... he loves you... he loves you so much
Baby he loves you... he loves you... he loves you so much

ఏ... అందమైన నీ కాలి కింద తిరిగే నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగి ఉన్న వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తొనికే గాలికున్న గతమంత
చుర్రుమన్న నీ చూపులోన ఎగిసే నిప్పు లాంటి నిజమంత

Baby he loves you... he loves you... he loves you so much
Baby he loves you... he loves you... he loves you so much

చరణం 2:

హాయ్.. పంటచేలలోని జీవమంత ఘంటసాల పాట భావమంత
పండగొచ్చినా పబ్బమొచ్చినా వంటశాలలోని వాసనంత
కుంభకర్ణుడి నిద్దరంత, ఆంజనేయుడి ఆయువంత
కృష్ణమూర్తిలో లీలలంత... రామలాలి అంత

Baby he loves you... he loves you... he loves you so much
Baby he loves you... loves you... loves you so much

పచ్చి వేప పుల్ల చేదు అంత... చేదు... రచ్చబండ పైన వాదనంత
అర్థమైన కాకపోయినా భక్తి కొద్ది విన్న వేదమంత
ఏటి నీటిలోని జాబిలంత... జాబిలి... ఏట ఏట వచ్చె జాతరంత... జాతర...
ఏకపాత్రలో నాటకాలలో నాటు గోలలంత

Baby he loves you... loves you... loves you so much
Baby he loves you... loves you... loves you so much

చరణం 3:

ఐసెర తస్సాదియ్యా || 8 ||

ఆల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత
జల్లుపడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత
ఓ... బిక్కు బిక్కు మంటు పరీక్ష రాసే పిల్లగాడి భెదురంత
లక్ష మందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత

Baby he loves you... he loves you... he loves you so much
Baby Baby he loves you... loves you... loves you too much

ఎంత దగ్గరైన నీకు నాకు మధ్య ఉన్న అంతులేని దూరమంత
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత
ఎంత ఓర్చుకున్న నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత
ఎంత గాయమైనా హాయిగానే మార్చే నా తీపి స్నేహమంత

Baby he loves you... he loves you... he loves you so much
Baby he loves you... loves you... I love you so much

pallavi:

shā... vāḍigi nā mīda preme ledu
He doesn't love me you know
NO..
He loves you... he loves you so muchh

avunā....ĕṁta?

ūm̐... ĕṁtaṁṭe... ā...

mŏdaḍi sāri nuvvu nannu sūsinappuḍu kaliginaṭṭi kobamaṁta
mŏdaḍi sāri nenu māṭlāḍinappuḍu pĕriginaṭṭi dveṣhamaṁtā
mŏdaḍi sāri nīgu muddubĕṭṭinappuḍu jariginaṭṭi doṣhamaṁta
sivarisāri nīgu nijaṁ sĕppinabuḍu tīrinaṭṭi bhāramaṁta

o... iṁkā..

saraṇaṁ 1:

o... tĕlla tĕllavāri pallĕḍūrulona allugunna vĕlugaṁta
pilla legadūḍa noḍigaṁṭugunna āvu pāla nuragaṁta
o...salla buvvalona naṁchuguṁṭu tinna āvagāya kāramaṁta
pĕḽḽi īḍugŏchchi tuḽḽi aḍudunna āḍabilla korigaṁta

Baby he loves you... he loves you... he loves you so muchh
Baby he loves you... he loves you... he loves you so muchh

e... aṁdamaina nī kāli kiṁda tirige nelagunna baruvaṁta
nīli nīli nī kaḽḽalona mĕrise niṁgi unna vayasaṁta
sallanaina nī śhvāsalona tŏnige gāligunna gadamaṁta
surrumanna nī sūbulona ĕgise nippu lāṁṭi nijamaṁta

Baby he loves you... he loves you... he loves you so muchh
Baby he loves you... he loves you... he loves you so muchh

saraṇaṁ 2:

hāy.. paṁṭaselaloni jīvamaṁta ghaṁṭasāla pāḍa bhāvamaṁta
paṁḍagŏchchinā pabbamŏchchinā vaṁṭaśhālaloni vāsanaṁta
kuṁbhagarṇuḍi niddaraṁta, āṁjaneyuḍi āyuvaṁta
kṛṣhṇamūrdilo līlalaṁta... rāmalāli aṁta

Baby he loves you... he loves you... he loves you so muchh
Baby he loves you... loves you... loves you so muchh

pachchi veba pulla sedu aṁta... sedu... rachchabaṁḍa paina vādanaṁta
ardhamaina kāgaboyinā bhakti kŏddi vinna vedamaṁta
eḍi nīḍiloni jābilaṁta... jābili... eḍa eḍa vachchĕ jādaraṁta... jādara...
egabātralo nāḍagālalo nāḍu golalaṁta

Baby he loves you... loves you... loves you so muchh
Baby he loves you... loves you... loves you so muchh

saraṇaṁ 3:

aisĕra tassādiyyā || 8 ||

āllarĕkkuvaide kannadalli vese mŏṭṭigāya sanuvaṁta
jallubaḍḍa veḽa pŏṁgi pŏṁgi pūse maṭṭibūla viluvaṁta
o... bikku bikku maṁṭu parīkṣha rāse pillagāḍi bhĕduraṁta
lakṣha maṁdinaina savālu sese āḍagāḍi pŏgaraṁta

Baby he loves you... he loves you... he loves you so muchh
Baby Baby he loves you... loves you... loves you too muchh

ĕṁta daggaraina nīgu nāgu madhya unna aṁtuleni dūramaṁta
ĕṁta seruvaina nuvvu nenu kalisi seraleni tīramaṁta
ĕṁta orsugunna nuvvu nāgu sese jñābagāla gāyamaṁta
ĕṁta gāyamainā hāyigāne mārse nā tībi snehamaṁta

Baby he loves you... he loves you... he loves you so muchh
Baby he loves you... loves you... I love you so muchh