Title (Indic)కదిలే పాదమిది నదిలా సాగమనదా WorkBaanam Year2009 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer Shankar Mahadevan LyricsTeluguపల్లవి: కదిలే పాదమిది నదిలా సాగమనదా...ఆ..ఆ పయనం ఆపకని పరుగే తీయమనదా..ఆ..ఆ ఆ కలల వెనకే అడుగు కదిపే ఆరాటం ఏ క్షణము నిజమై కుదుట పడునో ఆవేశం ప్రతి రోజు నీలో చిగురేసే ఆశే జతగా నడిచేనా శ్వాసై నిను గమ్యం చేర్చే దిశగా.... చరణం 1: చెరగదే జ్ఞాపకమేదైనా పసితనం దాటిన ప్రాయాన సమరమే స్వాగతమిచ్చేనా...ఆ..ఆ.. కలగనే ఆశయమేదైనా బతుకులో ఆశలు రేపేనా ఇపుడిలా నీ దరి చేరేనా..ఆ...ఆ... ఎదను తాకే గాయలు తాగే నేస్తాలు నీలో...ఓ... ఎదురు చూసే కాలాలు పూసే చైత్రాలు నీ దారిలో...ఓ..ఓ.. కదిలే పాదమిది నదిలా సాగమనదా...ఆ..ఆ పయనం ఆపకని పరుగే తీయమనదా..ఆ..ఆ చరణం 2: వెలుగయే వేకులలెన్నైనా వెతికితే లేవా నీలోనా జగతికే దారిని చూపేనా..ఆ..ఆ.. గగనమే నీ తొలి మజిలీనా గమనమే ఓ క్షణమాగేనా విజయమే నీడగ సాగేనా..ఆ..ఆ.. అలలు రేపే సంద్రాలు దూకే సైన్యాలు నీలో...ఓ.. చెలిమి కోరే లొకాలు చేసే స్నేహాలు ఈ వేళలో..ఓ... కదిలే పాదమిది నదిలా సాగమనదా...ఆ..ఆ పయనం ఆపకని పరుగే తీయమనదా..ఆ..ఆ Englishpallavi: kadile pādamidi nadilā sāgamanadā...ā..ā payanaṁ ābagani paruge tīyamanadā..ā..ā ā kalala vĕnage aḍugu kadibe ārāḍaṁ e kṣhaṇamu nijamai kuduḍa paḍuno āveśhaṁ pradi roju nīlo sigurese āśhe jadagā naḍisenā śhvāsai ninu gamyaṁ serse diśhagā.... saraṇaṁ 1: sĕragade jñābagamedainā pasidanaṁ dāḍina prāyāna samarame svāgadamichchenā...ā..ā.. kalagane āśhayamedainā badugulo āśhalu rebenā ibuḍilā nī dari serenā..ā...ā... ĕdanu tāge gāyalu tāge nestālu nīlo...o... ĕduru sūse kālālu pūse saitrālu nī dārilo...o..o.. kadile pādamidi nadilā sāgamanadā...ā..ā payanaṁ ābagani paruge tīyamanadā..ā..ā saraṇaṁ 2: vĕlugaye vegulalĕnnainā vĕdigide levā nīlonā jagadige dārini sūbenā..ā..ā.. gaganame nī tŏli majilīnā gamaname o kṣhaṇamāgenā vijayame nīḍaga sāgenā..ā..ā.. alalu rebe saṁdrālu dūge sainyālu nīlo...o.. sĕlimi kore lŏgālu sese snehālu ī veḽalo..o... kadile pādamidi nadilā sāgamanadā...ā..ā payanaṁ ābagani paruge tīyamanadā..ā..ā