Baagumde baagumde edo bamdhame

బాగుందే బాగుందే ఏదో బంధమే
Year
Language

పల్లవి:

హో.......ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక
మనసిచ్చా పూర్తిగా నా మనసునే అడగక
నువ్వైనా నేనైనా అనుకోనిది
నీలోన నాలోన జరిగే ఇది

బాగుందే బాగుందే ఏదో బంధమే
సాగిందే నీతో పాదమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
ఊగిందే నీకై హృదయమే

చరణం 1:

ద్వేషమే స్నేహమై కష్టమే ఇష్టమై
దూరమే తీరమై భారమే తేలికై
పంతాలే చిలిపిగ చదివిన పాఠాలై
భేదాలె చివరికి కలిసిన భావాలై
ఏనాడొ చినుకల్లే మొదలయినది
ఈనాడే వరదైన వరమే ఇది

బాగుందే బాగుందే ఏదో బంధమే
మోగిందే నాలో మౌనమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
లాగిందే ఊహాలోకమే

చరణం 2:

చూపులే చిత్రమై మాటలే మంత్రమై
ఊపిరే ఊయలై నవ్వులే వెన్నెలై
దేహాలే ప్రణయపు పువ్వుల దారాలై
ప్రాణాలే మమతల మల్లెల హారాలై
బ్రతుకంత బ్రతికించే భావం ఇది
ప్రతిరోజు జన్మించే మార్గం ఇది

బాగుందే బాగుందే ఏదో బంధమే
నువ్వంటే నా ప్రతిబింబమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
నువ్వేలే నా సగభాగమే

ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక
మనసిచ్చా పూర్తిగా నా మనసునే అడగక
నువ్వైనా నేనైనా అనుకోనిది
నీలోన నాలోన జరిగే ఇది
బాగుందే.... ఆ.....

pallavi:

ho.......premiṁchā kŏttagā idi premani tĕliyaga
manasichchā pūrdigā nā manasune aḍagaga
nuvvainā nenainā anugonidi
nīlona nālona jarige idi

bāguṁde bāguṁde edo baṁdhame
sāgiṁde nīdo pādame
bāguṁde bāguṁde edo baṁdhame
ūgiṁde nīgai hṛdayame

saraṇaṁ 1:

dveṣhame snehamai kaṣhṭame iṣhṭamai
dūrame tīramai bhārame teligai
paṁtāle silibiga sadivina pāṭhālai
bhedālĕ sivarigi kalisina bhāvālai
enāḍŏ sinugalle mŏdalayinadi
īnāḍe varadaina varame idi

bāguṁde bāguṁde edo baṁdhame
mogiṁde nālo mauname
bāguṁde bāguṁde edo baṁdhame
lāgiṁde ūhālogame

saraṇaṁ 2:

sūbule sitramai māḍale maṁtramai
ūbire ūyalai navvule vĕnnĕlai
dehāle praṇayabu puvvula dārālai
prāṇāle mamadala mallĕla hārālai
bradugaṁta bradigiṁche bhāvaṁ idi
pradiroju janmiṁche mārgaṁ idi

bāguṁde bāguṁde edo baṁdhame
nuvvaṁṭe nā pradibiṁbame
bāguṁde bāguṁde edo baṁdhame
nuvvele nā sagabhāgame

premiṁchā kŏttagā idi premani tĕliyaga
manasichchā pūrdigā nā manasune aḍagaga
nuvvainā nenainā anugonidi
nīlona nālona jarige idi
bāguṁde.... ā.....