Baagumdammaa baagumdi

బాగుందమ్మా బాగుంది
Year
Language

పల్లవి:

బాగుందమ్మా బాగుంది అమ్మాయి నీ ముద్దు
మళ్ళీ మళ్ళీ అంటాను అబ్బాయి చంపొద్దు
ఊయలల్లే ఊగే నీ నడుమే ముద్దు
హమ్మ హమ్మ హమ్మ సితం ఆగాలమ్మా

చరణం 1:

వెచ్చటి గుండెల చప్పుళ్ళో నా కంటి రెప్పల్లో
పదిలంగా ఉందోయమ్మ నీ రూపమే
పున్నమి వెన్నెల కాంతుల్లో ఆ మబ్బు డొంకల్లో
రేయంతా వెతికానమ్మా నీ కోసమే
అమ్మాయి బుగ్గల్లో మందారం మొగ్గల్లే దోబూచులాడుతున్న సిగ్గే ముద్దు
వద్దూ వద్దూ వద్దూ నను కవ్వించొద్దు మోమాటాలే వద్దూ గిలిగింతే వద్దు

చరణం 2:

ఉక్కిరి బిక్కిరి అవుతున్నా నేనెంత కాదన్నా
నీలోనే చేరిందమ్మా నా ఊపిరి
ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా ఈ రోజే చూస్తున్నా
నాకెంతో నచ్చిందమ్మా నీ వైఖరి
ఛీ పాడు సిగ్గన్నా సూదంటు రాయల్లే కుచ్చెళ్ళు లాగేస్తున్న చూపే ముద్దు
ముద్దు ముద్దు ముద్దు నీ నడుమే ముద్దు విప్పద్దయ్యో నువ్వు మరి చికాకొద్దు ॥

pallavi:

bāguṁdammā bāguṁdi ammāyi nī muddu
maḽḽī maḽḽī aṁṭānu abbāyi saṁpŏddu
ūyalalle ūge nī naḍume muddu
hamma hamma hamma sidaṁ āgālammā

saraṇaṁ 1:

vĕchchaḍi guṁḍĕla sappuḽḽo nā kaṁṭi rĕppallo
padilaṁgā uṁdoyamma nī rūbame
punnami vĕnnĕla kāṁtullo ā mabbu ḍŏṁkallo
reyaṁtā vĕdigānammā nī kosame
ammāyi buggallo maṁdāraṁ mŏggalle dobūsulāḍudunna sigge muddu
vaddū vaddū vaddū nanu kavviṁchŏddu momāḍāle vaddū giligiṁte vaddu

saraṇaṁ 2:

ukkiri bikkiri avudunnā nenĕṁta kādannā
nīlone seriṁdammā nā ūbiri
ĕppuḍu ĕppuḍu anugunnā ī roje sūstunnā
nāgĕṁto nachchiṁdammā nī vaikhari
shī pāḍu siggannā sūdaṁṭu rāyalle kuchchĕḽḽu lāgestunna sūbe muddu
muddu muddu muddu nī naḍume muddu vippaddayyo nuvvu mari sigāgŏddu ||