Avunu nijam nuvvamte naagishtam

అవును నిజం నువ్వంటే నాకిష్టం
Work
Year
Language

పల్లవి:

అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదుగా
హువా .. హువా .. హువా
తెలుసు కదా... ఆ... ఆ... ఆ...
హువా .. హువా .. హువా
తెలిసిందే అడగాలా
అడగందే అనవేలా
చెవిలో .......ఇలా చెబితే చాలా !

చరణం 1:

కసిరేస్తున్నా ..మనసుకి వినపడదో ఏమో
విసిరేస్తున్నా ..నిను విడి వెనుకకు రాదేమో
నిదరోతున్నా ..ఎదురై కనబడతావేమో
కదలాలన్నా ..కుదరని మెలి పెడతావేమో
అంతగా ..కంట చూడనని మొండికేస్తే తప్పేమో
ఒంటిగా .. ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో
మన సలహా మది వినదు కదా
హువా .. హువా .. హువా తెలుసు కదా... ఆ... ఆ... ఆ...
హువా .. హువా .. హువా
తెలిసే ......ఇలా చెలరేగాలా !

చరణం 2:

సుడిగాలిలో .. తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో .. చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో .. తమరిని వివరములడిగానా
ఎద ఏమందో .. వినమని తరుముకు రాలేనా
తప్పుకో .. కళ్ళు మూసుకుని తుళ్ళి రాకే నా వెంటా
ఒప్పుకో.. నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంటా
నడపదుగా నిను నది వరదా ..
హువా .. హువా .. హువా తెలుసు కదా... ఆ... ఆ... ఆ...
హువా .. హువా .. హువా
తెలిసే ఇలా... ముంచెయ్యాలా !!!

pallavi:

avunu nijaṁ nuvvaṁṭe nāgiṣhṭaṁ
ī nimiṣhaṁ gurdiṁchā ā satyaṁ
sali paradā iga nilavadugā
huvā .. huvā .. huvā
tĕlusu kadā... ā... ā... ā...
huvā .. huvā .. huvā
tĕlisiṁde aḍagālā
aḍagaṁde anavelā
sĕvilo .......ilā sĕbide sālā !

saraṇaṁ 1:

kasirestunnā ..manasugi vinabaḍado emo
visirestunnā ..ninu viḍi vĕnugagu rādemo
nidarodunnā ..ĕdurai kanabaḍadāvemo
kadalālannā ..kudarani mĕli pĕḍadāvemo
aṁtagā ..kaṁṭa sūḍanani mŏṁḍigeste tappemo
ŏṁṭigā .. uṁḍanīyanani muṁdugŏste muppemo
mana salahā madi vinadu kadā
huvā .. huvā .. huvā tĕlusu kadā... ā... ā... ā...
huvā .. huvā .. huvā
tĕlise ......ilā sĕlaregālā !

saraṇaṁ 2:

suḍigālilo .. tĕliyani parugulu tīstunnā
jaḍabūlado .. sĕlimigi samayamu dŏrigenā
ĕdaremuṁdo .. tamarini vivaramulaḍigānā
ĕda emaṁdo .. vinamani tarumugu rālenā
tappugo .. kaḽḽu mūsuguni tuḽḽi rāge nā vĕṁṭā
ŏppugo.. ninnu nammamani alluguṁṭā nī jaṁṭā
naḍabadugā ninu nadi varadā ..
huvā .. huvā .. huvā tĕlusu kadā... ā... ā... ā...
huvā .. huvā .. huvā
tĕlise ilā... muṁchĕyyālā !!!