Aunani amtaavo mari kaadani amtaavo

ఔనని అంటావో మరి కాదని అంటావో
Work
Year
Language

పల్లవి:

ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
తెలియక సతమతమౌతోందీ నా మనసెంతో
అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని

ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో

చరణం 1:

చిగురాకుల లేఖలు రాసి చిరుగాలి చేతికి ఇచ్చి
ఎపుడో నే పంపించాను నువ్వు చూడలేదా
నా మనసే పడవగ చేసి కలలన్ని అలలుగ చేసి
ఎపుడో నే పంపించాను నిన్ను చేరలేదా
చెప్పాలని అనిపిస్తున్న నా ఎదుటే నువ్ కూర్చున్న
మనసులొన మాట నీకు చెప్పలేక పొతున్నా
చెప్పకుండ ఓ క్షణమైన వుండలేక పొతున్న
ఎలా చెప్పనమ్మ నాలొని ప్రేమని
ఎలా చూపనమ్మ నా ప్రేమ నువ్వని

చరణం 2:

ప్రేమన్నది ఊపిరి కాదా
అందరిలో ఉండేదేగా
పరిచయమే లేదని అంటే వింతే కదా
నువ్వున్నది నాలోనేగా
ఈ సంగతి విననే లేదా
మదిలోనే నువ్ నిదరోతూ గమనించలేదా
ఎదనిండా ఆశలు ఉన్నా ఎన్నెన్నో ఊసులు ఉన్నా
ప్రేమ భాష రాదు అంటే నమ్మవా ఓ మైనా
కళ్ళలోకి చూసి అయినా పోల్చూకోవా నా ప్రేమ
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని

pallavi:

aunani aṁṭāvo mari kādani aṁṭāvo
emaṁṭāvo emonanna saṁdehaṁto
emani sĕppālo nīgemani sĕppālo
tĕliyaga sadamadamaudoṁdī nā manasĕṁto
aḍo iḍo ĕḍo mari telani nimiṣhaṁlo
ĕlā sĕppanammā nāloni premani
ĕlā sūbanammā nā prema nuvvani

aunani aṁṭāvo mari kādani aṁṭāvo
emaṁṭāvo emonanna saṁdehaṁto

saraṇaṁ 1:

sigurāgula lekhalu rāsi sirugāli sedigi ichchi
ĕbuḍo ne paṁpiṁchānu nuvvu sūḍaledā
nā manase paḍavaga sesi kalalanni alaluga sesi
ĕbuḍo ne paṁpiṁchānu ninnu seraledā
sĕppālani anibistunna nā ĕduḍe nuv kūrsunna
manasulŏna māḍa nīgu sĕppalega pŏdunnā
sĕppaguṁḍa o kṣhaṇamaina vuṁḍalega pŏdunna
ĕlā sĕppanamma nālŏni premani
ĕlā sūbanamma nā prema nuvvani

saraṇaṁ 2:

premannadi ūbiri kādā
aṁdarilo uṁḍedegā
parisayame ledani aṁṭe viṁte kadā
nuvvunnadi nālonegā
ī saṁgadi vinane ledā
madilone nuv nidarodū gamaniṁchaledā
ĕdaniṁḍā āśhalu unnā ĕnnĕnno ūsulu unnā
prema bhāṣha rādu aṁṭe nammavā o mainā
kaḽḽalogi sūsi ayinā polsūgovā nā prema
ĕlā sĕppanammā nāloni premani
ĕlā sūbanammā nā prema nuvvani