Asalem gurduguraadu naa kannulamumdu

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు
Year
Language

పల్లవి:

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక ||2||

నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా

చరణం 1:

గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ....
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ....

అల్లుకొమ్మని గిల్లుతున్నది చల్చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి

ఏకమయే .. ఏకమయే ఏకాంతం లోకమయే వేళ
అహా జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల

చరణం 2:

కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ....
కౌగిలింతల సీమలో కోటకట్టుకుని కొలువుండనీ....

చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు హాహాకారం

మళ్ళీ మళ్ళీ.. మళ్ళీ మళ్ళీ ఈ రోజు రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం

pallavi:

asaleṁ gurdugurādu nā kannulamuṁdu nuvvu uṁḍagā
asaleṁ tosadu nāgu o nimiṣhaṁ kūḍā ninnu sūḍaga ||2||

nīlo uṁdi nā prāṇaṁ adi nīgu tĕlusunā
unnā nenu nī kosaṁ nuvu dūramaide badagagalanā

saraṇaṁ 1:

goruvĕchchani ūsudo sinna muchchaḍani vinibiṁchanī....
āgubachchani āśhado ninnu suṭṭuguni siguriṁchanī....

allugŏmmani gilludunnadi salsallani gāli
tĕllavārulu allarallari sāgiṁchāli

egamaye .. egamaye egāṁtaṁ logamaye veḽa
ahā jaṁṭa ūbiri veḍigi marigiṁdi vĕnnĕla

saraṇaṁ 2:

kaṁṭi rĕppala sāḍugā ninnu dāsuguni baṁdhiṁchanī....
kaugiliṁtala sīmalo koḍagaṭṭuguni kŏluvuṁḍanī....

sĕṁta seride sedi gājulu sese gāyaṁ
jaṁṭa madhyana sannajājulu hāhāgāraṁ

maḽḽī maḽḽī.. maḽḽī maḽḽī ī roju rammannā rādemo
nilavanī siragālamilāge ī kṣhaṇaṁ