Arere sejaarimdaa

అరెరె చేజారిందా
Work
Year
Language

పల్లవి:

ఇట్స్ ఓకే లే
ఇది మాములే అనుకోవాలే
ఎదిరించాలే
చిరునవ్వుతో చీకటినోడించాలే
బరువెంతైనా అణువంతేలే
ఎదురీదాలే పద లే లే లే

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

నీతో బంధం కలిపే సంతోషం ఏదో
సొంతం కాదా నేడే రేపో
ఆశ వెలుగు అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

Everything's gonna be alright
Everything's gonna be alright

చరణం 1:

ఎండ వానలు జంట కానిదే.. ఏడు రంగులు రావులే
ఎద గాయం గేయమైతే.. వెదురైనా వేణువే
మదిలో తీపి కొలువుంటే.. దరికే కలత రాదంతే
కన్నీరైనా.. పన్నీరైనా.. కనుపాపను నవ్విస్తే

ఆశ వెలుగు.. అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు..

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

చరణం 2:

లలల్ లలలల ల.. లలల్ లలలల ల

మోడువారిన కొమ్మ రెమ్మలు.. కొత్త చిగురే చేరదా
నిండు కడలే ఆవిరైనా.. నింగి చినుకై జారదా
కసిరే ఏకాంతమంటే.. ముసిరే స్నేహ పరిమళమే
నీలో ఎదిగే.. శూన్యంలో పిలుపేదో ఉందిలే

ఆశ వెలుగు.. అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

pallavi:

iṭs oge le
idi māmule anugovāle
ĕdiriṁchāle
sirunavvudo sīgaḍinoḍiṁchāle
baruvĕṁtainā aṇuvaṁtele
ĕdurīdāle pada le le le

arĕrĕ sejāriṁdā nīlo uṁdedo
sarĕle kānī sūddām muṁdemavuduṁdo

arĕrĕ sejāriṁdā nīlo uṁdedo
sarĕle kānī sūddām muṁdemavuduṁdo

nīdo baṁdhaṁ kalibe saṁtoṣhaṁ edo
sŏṁtaṁ kādā neḍe rebo
āśha vĕlugu ade muṁdaḍugu
niśhi nīḍagu talŏṁchagu

arĕrĕ sejāriṁdā nīlo uṁdedo
sarĕle kānī sūddām muṁdemavuduṁdo

Everything's gonna be alright
Everything's gonna be alright

saraṇaṁ 1:

ĕṁḍa vānalu jaṁṭa kānide.. eḍu raṁgulu rāvule
ĕda gāyaṁ geyamaide.. vĕdurainā veṇuve
madilo tībi kŏluvuṁṭe.. darige kalada rādaṁte
kannīrainā.. pannīrainā.. kanubābanu navviste

āśha vĕlugu.. ade muṁdaḍugu
niśhi nīḍagu talŏṁchagu..

arĕrĕ sejāriṁdā nīlo uṁdedo
sarĕle kānī sūddām muṁdemavuduṁdo

saraṇaṁ 2:

lalal lalalala la.. lalal lalalala la

moḍuvārina kŏmma rĕmmalu.. kŏtta sigure seradā
niṁḍu kaḍale āvirainā.. niṁgi sinugai jāradā
kasire egāṁtamaṁṭe.. musire sneha parimaḽame
nīlo ĕdige.. śhūnyaṁlo pilubedo uṁdile

āśha vĕlugu.. ade muṁdaḍugu
niśhi nīḍagu talŏṁchagu

arĕrĕ sejāriṁdā nīlo uṁdedo
sarĕle kānī sūddām muṁdemavuduṁdo