Title (Indic)కీరవాణి...చిలకలా కొలికిరో పాడవేమే WorkAnveshana Year1985 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer S. Janaki Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: సా...నిసరిసాని...ఆహాహా సా నిసమగామరి పదసా..నిసరీసాని... ఆహాహా సా..నిసమగామరి పదసససని రిరిరిస గగగరి మపమగ పా... సా ని ద ప మ గ రి స ని.. కీరవాణి...చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగ అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి కీరవాణి... చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా ఆ ఆ.... చరణం 1: గరిస పమగ పాని సరిగ రిగస నీదా.. ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా నీ గగనాలలో నే చిరుతారనై నీ అధరాలలో నే చిరునవ్వునై స్వరమే లయగా ముగిసే.. సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే.... కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా ఇలరాలిన పువ్వులు వెదజల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణి కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా ఆ.... చరణం 2: నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై సంపెంగలా గాలినై తారాడనా నీడనై నీ కవనాలలో నే తొలి ప్రాసనై నీ జవనాలలో జాజుల వాసనై ఎదలో ఎదలే కదిలే పడచుల మనసుల పంజర సుఖముల పలుకులు తెలియకనే కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగ అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి కీరవాణి... చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా ఆ ఆ... Englishpallavi: sā...nisarisāni...āhāhā sā nisamagāmari padasā..nisarīsāni... āhāhā sā..nisamagāmari padasasasani riririsa gagagari mabamaga pā... sā ni da pa ma ga ri sa ni.. kīravāṇi...silagalā kŏligiro pāḍaveme valabule tĕlubagā virabūsina āśhalu viridenĕlu sallaga alarulu kurisina ṛtuvula taḍisina madhurasavāṇi kīravāṇi... silagalā kŏligiro pāḍaveme valabule tĕlubagā ā ā.... saraṇaṁ 1: garisa pamaga pāni sariga rigasa nīdā.. ī pūlalo aṁdamai ī gālilo gaṁdhamai nā toḍalo saitramai ī bāḍane naḍasirā nī gaganālalo ne sirudāranai nī adharālalo ne sirunavvunai svarame layagā mugise.. salalida kalaruda svaranuda gadiyuda gamagamu tĕliyagane.... kīravāṇi silagalā kalagalā pāḍaledu valabule tĕlubagā ilarālina puvvulu vĕdajallina tāvula aligiḍi ĕrugani pilubula aligina maṁjulavāṇi kīravāṇi silagalā kalagalā pāḍaledu valabule tĕlubagā ā.... saraṇaṁ 2: nī kannulā nīlamai nī navvulā vĕnnĕlai saṁpĕṁgalā gālinai tārāḍanā nīḍanai nī kavanālalo ne tŏli prāsanai nī javanālalo jājula vāsanai ĕdalo ĕdale kadile paḍasula manasula paṁjara sukhamula palugulu tĕliyagane kīravāṇi silagalā kalagalā pāḍaledu valabule tĕlubagā virabūsina āśhalu viridenĕlu sallaga alarulu kurisina ṛtuvula taḍisina madhurasavāṇi kīravāṇi... silagalā kŏligiro pāḍaveme valabule tĕlubagā ā ā...