అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం
పల్లవి:
అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని
కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా .. నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా
అందరిలో ఇన్నాళ్ళు శిలనై ఉన్నా .. నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా !
చరణం 1:
నీలి నింగిలో తేలుతున్న కొంటె వానవెల్లే .. నా నవ్వులో జారినా రంగులేరుకోదా
నీటి పొంగులో తుళ్లుతున్న చిట్టి చేప పిల్లై .. నా వేగమే ఇమ్మనీ నన్ను కోరుకోదా
రేగే నా ఊహల్ని ఊరేగనీ ... సాగే ఆ గువ్వల్ని ఓడించగా
నా సైగకు తలవంచి ఆ మేఘమే ... చినుకల్లే నా ముందే వాలిందిగా
ఒదిగున్న చిన్ని మనసే ... తొలి నడక నేచుకున్నదా ...
ఇక ఉన్న చోటనే ఉంటుందా !!!
చరణం 2:
నిన్న లేని ఆ స్నేహమేదో నీడలాగ మారి .. నా తోడుగా చేరుతూ నన్ను వీడనందా
ఉన్నపాటుగా ఈ ప్రయాణం సాగుతున్న దారి .. ప్రతి మలుపులో వింతలే నాకు చూపుతుందా
ఈ కలలే తీరేనా ఇన్నాళ్లకి ... సాయంగా మారిందా ఆ స్నేహమే
గుండెల్లో దాగున్న నా పాటకి ... రాగాలే నేర్పిందా ఈ బంధమే
ఈ ఆశ జారిపోని ... తీరాన్ని చేరుకోనీ ... నూరేళ్ల జీవితం నాదవనీ !!!
pallavi:
anugoledenāḍu ī logaṁ nāgosaṁ aṁdaṁgā mustābai uṁṭuṁdani
ī kṣhaṇame sūstunnā ūrege veḍugalu ūriṁche ĕnnĕnno varṇālani
kanibiṁche ī satyaṁ svapname anugonā .. nijamaṁṭe ĕvarainā nammane legunnā
aṁdarilo innāḽḽu śhilanai unnā .. naḍisaṁdraṁlo īnāḍe alanayyānā !
saraṇaṁ 1:
nīli niṁgilo teludunna kŏṁṭĕ vānavĕlle .. nā navvulo jārinā raṁgulerugodā
nīḍi pŏṁgulo tuḽludunna siṭṭi seba pillai .. nā vegame immanī nannu korugodā
rege nā ūhalni ūreganī ... sāge ā guvvalni oḍiṁchagā
nā saigagu talavaṁchi ā meghame ... sinugalle nā muṁde vāliṁdigā
ŏdigunna sinni manase ... tŏli naḍaga nesugunnadā ...
iga unna soḍane uṁṭuṁdā !!!
saraṇaṁ 2:
ninna leni ā snehamedo nīḍalāga māri .. nā toḍugā serudū nannu vīḍanaṁdā
unnabāḍugā ī prayāṇaṁ sāgudunna dāri .. pradi malubulo viṁtale nāgu sūbuduṁdā
ī kalale tīrenā innāḽlagi ... sāyaṁgā māriṁdā ā snehame
guṁḍĕllo dāgunna nā pāḍagi ... rāgāle nerbiṁdā ī baṁdhame
ī āśha jāriboni ... tīrānni serugonī ... nūreḽla jīvidaṁ nādavanī !!!