Title (Indic)నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమ& WorkAntam Year1992 LanguageTelugu Credits Role Artist Music Aar.di. barman Performer Balasubramaniam S.P. Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో ఓ లాల లాల ఓ ఓ లాలాలాలాల నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో చరణం 1: నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ ఓ... నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ నాలో సాగిన నీ అడుగులో చూసాను మన నేర్పుని పంచేందుకే ఒకరు లేని బ్రతుకెంత బరువో అని ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని చరణం 2: నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ (2) వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించనీ నా పెదవిలోనూ ఇలాగే చిరునవ్వు పుడుతుందనీ నీ సిగ్గు నా జీవితాన తొలిముగ్గు పెడుతుందనీ చరణం 3: ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో ఆ... ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మరోకొత్త జన్మం పొందేటి బంధాలతో ఆ లాల లాల ఆఆ లాలాలాలాల నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో Englishpallavi: nī navvu sĕppiṁdi nādo nenĕvvaro emiḍo nī nīḍa sūbiṁdi nālo innāḽḽa loḍemiḍo o lāla lāla o o lālālālāla nī navvu sĕppiṁdi nādo nenĕvvaro emiḍo nī nīḍa sūbiṁdi nālo innāḽḽa loḍemiḍo saraṇaṁ 1: nāgai sāsina nī sedilo sadivānu nā ninnanī o... nāgai sāsina nī sedilo sadivānu nā ninnanī nālo sāgina nī aḍugulo sūsānu mana nerbuni paṁcheṁduge ŏgaru leni bradugĕṁta baruvo ani e toḍugī nosugoni naḍagĕṁta alubo ani saraṇaṁ 2: nallani nī kanubābalalo udayālu kanibiṁchanī (2) vĕnnĕla pere vinibiṁchani naḍireyi karigiṁchanī nā pĕdavilonū ilāge sirunavvu puḍuduṁdanī nī siggu nā jīvidāna tŏlimuggu pĕḍuduṁdanī saraṇaṁ 3: enāḍaide ī jīvidaṁ rĕṭṭiṁpu baruvĕkkuno ā... enāḍaide ī jīvidaṁ rĕṭṭiṁpu baruvĕkkuno tanuvu manasu sĕrisagamani paṁchāli anibiṁchuno sarigā ade śhubhamuhūrdaṁ saṁpūrṇamayyeṁdugu maname marogŏtta janmaṁ pŏṁdeḍi baṁdhālado ā lāla lāla āā lālālālāla nī navvu sĕppiṁdi nādo nenĕvvaro emiḍo nī nīḍa sūbiṁdi nālo innāḽḽa loḍemiḍo