Annayya hrdayam devaalayam

అన్నయ్య హృదయం దేవాలయం
Year
Language

పల్లవి:

అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం..ఊఁ..ఊఁ..
అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం
అనురాగమే కొలువున్న దైవం
అనుబంధమే గోపురం
మా అనుబంధమే గోపురం

అన్నయ్య హృదయం దేవాలయం..ఊఁ..ఊఁ..

చరణం 1:

పంచుకున్నది ఒకటే రక్తం.. పెంచుకున్నది ఒకటే పాశం
పంచుకున్నది ఒకటే రక్తం.. పెంచుకున్నది ఒకటే పాశం
బ్రతుకున్నది ఆ పాశం కోసం..
బ్రతుకున్నది ఆ పాశం కోసం.. కోరుకున్నది ఇద్దరి క్షేమం

అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం
అన్నయ్య హృదయం దేవాలయం..

చరణం 2:

ఊయలలూపి జోలలు పాడే తల్లినెరగను..ఊ..
మోసుకు తిరిగి ముచ్చట తీర్చే తండ్రినెరగను..ఊ..
కళ్ళు తెరిచి నే చూచినదే ఈ కరుణామూర్తిని
మాట నేర్చి నే పిలిచినదే అన్నా అన్నది

అన్నయ్య హృదయం దేవాలయం..

చరణం 3:

కృష్ణుడు పల్కిన గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకూ..ఊ..
కృష్ణుడు పల్కిన గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకు
నా పాలి వేదం అన్నయ్య పలుకు..
నా పాలి వేదం అన్నయ్య పలుకు..
అన్నయ్య నవ్వే నా దారి వెలుగు..ఊ..

అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం
అనురాగమే కొలువున్న దైవం
అనుబంధమే గోపురం
మా అనుబంధమే గోపురం

అన్నయ్య హృదయం దేవాలయం..ఊఁ..ఊఁ..

pallavi:

annayya hṛdayaṁ devālayaṁ
sĕllĕle ā guḍi maṇidībaṁ..ūm̐..ūm̐..
annayya hṛdayaṁ devālayaṁ
sĕllĕle ā guḍi maṇidībaṁ
anurāgame kŏluvunna daivaṁ
anubaṁdhame goburaṁ
mā anubaṁdhame goburaṁ

annayya hṛdayaṁ devālayaṁ..ūm̐..ūm̐..

saraṇaṁ 1:

paṁchugunnadi ŏgaḍe raktaṁ.. pĕṁchugunnadi ŏgaḍe pāśhaṁ
paṁchugunnadi ŏgaḍe raktaṁ.. pĕṁchugunnadi ŏgaḍe pāśhaṁ
bradugunnadi ā pāśhaṁ kosaṁ..
bradugunnadi ā pāśhaṁ kosaṁ.. korugunnadi iddari kṣhemaṁ

annayya hṛdayaṁ devālayaṁ
sĕllĕle ā guḍi maṇidībaṁ
annayya hṛdayaṁ devālayaṁ..

saraṇaṁ 2:

ūyalalūbi jolalu pāḍe tallinĕraganu..ū..
mosugu tirigi muchchaḍa tīrse taṁḍrinĕraganu..ū..
kaḽḽu tĕrisi ne sūsinade ī karuṇāmūrdini
māḍa nersi ne pilisinade annā annadi

annayya hṛdayaṁ devālayaṁ..

saraṇaṁ 3:

kṛṣhṇuḍu palgina gīdavākku.. vedaṁ ayinā ĕṁdugu nāgū..ū..
kṛṣhṇuḍu palgina gīdavākku.. vedaṁ ayinā ĕṁdugu nāgu
nā pāli vedaṁ annayya palugu..
nā pāli vedaṁ annayya palugu..
annayya navve nā dāri vĕlugu..ū..

annayya hṛdayaṁ devālayaṁ
sĕllĕle ā guḍi maṇidībaṁ
anurāgame kŏluvunna daivaṁ
anubaṁdhame goburaṁ
mā anubaṁdhame goburaṁ

annayya hṛdayaṁ devālayaṁ..ūm̐..ūm̐..