Title (Indic)యేలే పొగిలేవే యిప్పు డింతిరో నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) యేలే పొగిలేవే యిప్పు డింతిరో నీవు వాలాయించి నీ విభుఁడు వచ్చి కూడీఁ గాక (॥॥) కడుఁ దమకముతోడఁ గాచుకున్నకాంతను సడిఁ బెట్టి యేఁపునా సరఁసుడు జడియక మోవితేనె చవిచూపి చెక్కు నొక్కి బడలిక లెల్లాఁ దీర్చి పచారించుఁగాక (॥॥) ఆసల నెదురుచూచి అండకు వచ్చినదాని గాసిలఁ గాఁక రేఁచునా కాంతుఁడు వేసరక నవ్వు నవ్వి వెడసిగ్గులు దేర్చి రాసికెక్కఁ జన విచ్చి రక్షించుఁ గాక (॥॥) మించి వుర మెక్కి యలమేలుమంగవైన నిన్ను వంచించునా శ్రీ వేంకట వల్లభుఁడు పొంచి కౌఁగిలించుకొని భోగపు రతుల నించి యెంచరాని నీతలఁపు లీడేర్చుఁ గాకా English(||pallavi||) yele pŏgileve yippu ḍiṁtiro nīvu vālāyiṁchi nī vibhum̐ḍu vachchi kūḍīm̐ gāga (||||) kaḍum̐ damagamudoḍam̐ gāsugunnagāṁtanu saḍim̐ bĕṭṭi yem̐punā saram̐suḍu jaḍiyaga movidenĕ savisūbi sĕkku nŏkki baḍaliga lĕllām̐ dīrsi pasāriṁchum̐gāga (||||) āsala nĕdurusūsi aṁḍagu vachchinadāni gāsilam̐ gām̐ka rem̐sunā kāṁtum̐ḍu vesaraga navvu navvi vĕḍasiggulu dersi rāsigĕkkam̐ jana vichchi rakṣhiṁchum̐ gāga (||||) miṁchi vura mĕkki yalamelumaṁgavaina ninnu vaṁchiṁchunā śhrī veṁkaḍa vallabhum̐ḍu pŏṁchi kaum̐giliṁchugŏni bhogabu radula niṁchi yĕṁcharāni nīdalam̐pu līḍersum̐ gāgā