Title (Indic)విన్నపములెల్ల నాచే విందువు గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) విన్నపములెల్ల నాచే విందువు గాక సన్నలెల్ల సరివచ్చె జాగులిఁక నేలా (॥విన్న॥) నగినట్టివాఁడవు నాలియిఁకఁ జేయకుమీ చిగురుమోవిచవులఁ జిక్కుదుగాని మొగమెదుటనుందాన మోహము నీలోనున్నది అగడాయఁ బనులెల్లననుమానాలేలా (॥విన్న॥) మాటలాడినవాఁడవు మరిగుట్టుసేయకుమీ యీటుగా నీమనసెల్లనినిత్తువుగాని పాటించి నీకు మొక్కితి భావము నీవెరుఁగుదు కూటములు నెరవేరె కొంకుగొసరేలా (॥విన్న॥) మెచ్చినట్టివాఁడవు మేకులిఁకఁ జేయకుమీ అచ్చలాన యిక్కువలే అంటుదుగాని యిచ్చగించి శ్రీ వెంకటేశ నన్నుఁ గూడితివి లచ్చనలే గురుతాయ లాగవేగాలేలా English(||pallavi||) vinnabamulĕlla nāse viṁduvu gāga sannalĕlla sarivachchĕ jāgulim̐ka nelā (||vinna||) naginaṭṭivām̐ḍavu nāliyim̐kam̐ jeyagumī sigurumovisavulam̐ jikkudugāni mŏgamĕduḍanuṁdāna mohamu nīlonunnadi agaḍāyam̐ banulĕllananumānālelā (||vinna||) māḍalāḍinavām̐ḍavu mariguṭṭuseyagumī yīḍugā nīmanasĕllaninittuvugāni pāḍiṁchi nīgu mŏkkidi bhāvamu nīvĕrum̐gudu kūḍamulu nĕraverĕ kŏṁkugŏsarelā (||vinna||) mĕchchinaṭṭivām̐ḍavu megulim̐kam̐ jeyagumī achchalāna yikkuvale aṁṭudugāni yichchagiṁchi śhrī vĕṁkaḍeśha nannum̐ gūḍidivi lachchanale gurudāya lāgavegālelā