Title (Indic)వెనకటిపొందు గద్దు వెఱపేల నీకును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వెనకటిపొందు గద్దు వెఱపేల నీకును అనుమాన మిఁకనేల ఆడవయ్య మాఁట (॥వెన॥) సిగ్గులు మోమునఁగాని చిత్తములోపల లేదు దగ్గరి కూచుండవయ్య తరుణివద్ద వెగ్గళించినా నిన్ను వింతెలా నీకు నాపెకు అగ్గమైనదాఁకా నింతే అంటవయ్య చన్నులు (॥వెన॥) జంకెలు బొమ్మలఁగాని చలము లోపల లేదు వంకలు దీరుచవయ్య వడిఁ గురులు మంకునఁ దిట్టినా నిన్ను మచ్చిక నీమీఁదఁ గద్దు సంకెదీరుదాఁకా నింతే చల్లవయ్య వలపు (॥వెన॥) మఱగు రెప్పలఁగాని మర్మము లోపల లేదు యెఱిగి మోవియ్యవయ్య యెదురుగాను జఱసి శ్రీవేంకటేశ సతి నిట్టె కూడితివి నెఱవైనదాకా నింతే నించవయ్య కరుణ English(||pallavi||) vĕnagaḍibŏṁdu gaddu vĕṟabela nīgunu anumāna mim̐kanela āḍavayya mām̐ṭa (||vĕna||) siggulu momunam̐gāni sittamulobala ledu daggari kūsuṁḍavayya taruṇivadda vĕggaḽiṁchinā ninnu viṁtĕlā nīgu nābĕgu aggamainadām̐kā niṁte aṁṭavayya sannulu (||vĕna||) jaṁkĕlu bŏmmalam̐gāni salamu lobala ledu vaṁkalu dīrusavayya vaḍim̐ gurulu maṁkunam̐ diṭṭinā ninnu machchiga nīmīm̐dam̐ gaddu saṁkĕdīrudām̐kā niṁte sallavayya valabu (||vĕna||) maṟagu rĕppalam̐gāni marmamu lobala ledu yĕṟigi moviyyavayya yĕdurugānu jaṟasi śhrīveṁkaḍeśha sadi niṭṭĕ kūḍidivi nĕṟavainadāgā niṁte niṁchavayya karuṇa