Title (Indic)వేగిరింతు నిన్నాళ్ళు వెఱ్ఱిదాననై నిన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వేగిరింతు నిన్నాళ్ళు వెఱ్ఱిదాననై నిన్ను నీ గురుతుదాననై నిండుకుండేఁ జాలును (॥వేగి॥) మాపుదాఁకానే నెంత మతి నిన్నుఁగోరినాను రాఁపుల నీచిత్తము రావలెఁగా యేపున నిన్ను దూరి యెందాఁకా వేసరించేను కైపగు నీ చెలులతోఁ గడనుండేఁ జాలును (॥వేగి॥) తల్లి డించి నీకు గానే తప మెంత సేసి నాను పొల్లులేని దయ నీకు బుట్టి వలెఁగా ఇల్లిదె బలిమి వల పెటువలె నీడేరు వొల్ల నాలనైన నీవద్ద నుండే జాలును (॥వేగి॥) కమ్మటి నేనే నిన్ను కాఁగిట బిగించినాను సమ్మతించి అప్ప ణియ్యఁ జాల వలెఁగా యిమ్ముల శ్రీ వేంకటేశ యింతసేసి కూడితివి రమ్మనిపంచుక నీతో రతికెక్కేఁ జాలును English(||pallavi||) vegiriṁtu ninnāḽḽu vĕṭridānanai ninnu nī gurududānanai niṁḍuguṁḍem̐ jālunu (||vegi||) mābudām̐kāne nĕṁta madi ninnum̐gorinānu rām̐pula nīsittamu rāvalĕm̐gā yebuna ninnu dūri yĕṁdām̐kā vesariṁchenu kaibagu nī sĕluladom̐ gaḍanuṁḍem̐ jālunu (||vegi||) talli ḍiṁchi nīgu gāne taba mĕṁta sesi nānu pŏlluleni daya nīgu buṭṭi valĕm̐gā illidĕ balimi vala pĕḍuvalĕ nīḍeru vŏlla nālanaina nīvadda nuṁḍe jālunu (||vegi||) kammaḍi nene ninnu kām̐giḍa bigiṁchinānu sammadiṁchi appa ṇiyyam̐ jāla valĕm̐gā yimmula śhrī veṁkaḍeśha yiṁtasesi kūḍidivi rammanibaṁchuga nīdo radigĕkkem̐ jālunu