Title (Indic)వలవ నేరుతుఁగాని వాదించ నేరరా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వలవ నేరుతుఁగాని వాదించ నేరరా మెలఁగి నీ వెట్టుండినా మెచ్చకుండలేనురా (॥వలవ॥) బిగిసి నీవు రాకున్నా పిలువ రా నేర్తుఁ గాని తెగి నీతో నలిగి సాదించ నేరరా వొగి నిన్నుఁ గానకున్నా వుసురన నేర్తుఁ గాని వెగటై యెందుంటి వని వెంగెమాడ నేరరా (॥వలవ॥) నీటున నీ వుండితేఁ గన్నీరు నించ నేర్తుఁ గాని తేటల నేమి సేసినాఁ దిట్ట నేరరా నాఁటి నీ సుద్దులు విని నవ్వుకొన నేర్తుఁ గాని మాటల నీ పొందు లిఁక మాన లేను రా (॥వలవ॥) చీఱి చేయి వేసితే సిగ్గువడ నేర్తుఁ గాని మాఱుమోము చేసుకో మరి నేర రా ఆఱడి శ్రీవేంకటేశ అన్నిటాఁ గూడితి నన్ను వూఱడించితివి నిన్ను వొంటిఁ బాయ లేను రా English(||pallavi||) valava nerudum̐gāni vādiṁcha nerarā mĕlam̐gi nī vĕṭṭuṁḍinā mĕchchaguṁḍalenurā (||valava||) bigisi nīvu rāgunnā piluva rā nerdum̐ gāni tĕgi nīdo naligi sādiṁcha nerarā vŏgi ninnum̐ gānagunnā vusurana nerdum̐ gāni vĕgaḍai yĕṁduṁṭi vani vĕṁgĕmāḍa nerarā (||valava||) nīḍuna nī vuṁḍidem̐ gannīru niṁcha nerdum̐ gāni teḍala nemi sesinām̐ diṭṭa nerarā nām̐ṭi nī suddulu vini navvugŏna nerdum̐ gāni māḍala nī pŏṁdu lim̐ka māna lenu rā (||valava||) sīṟi seyi veside sigguvaḍa nerdum̐ gāni māṟumomu sesugo mari nera rā āṟaḍi śhrīveṁkaḍeśha anniḍām̐ gūḍidi nannu vūṟaḍiṁchidivi ninnu vŏṁṭim̐ bāya lenu rā