Title (Indic)తొక్కనిచోట్లు దొక్కెడి మనసు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తొక్కనిచోట్లు దొక్కెడి మనసు యెక్కడ గతిలే దింకనో తెరువు (॥తొక్క॥) పాపము వాయదు పై పై మనసున కోపము దీరదు కొంతైనా దీపన బాధయుఁ దీర దిన్నియును యేపునఁ బెనఁగొనె నింకనో తెరువు (॥తొక్క॥) యెవ్వనమదమును నెడయదు కోరికె కొవ్వును నణఁగదు కొంతైనా రవ్వగు మమకారముఁ బెడఁబాయదు యెవ్విధియును లేదింకవో తెరువు (॥తొక్క॥) వెఱపును విడువదు వెడమాయలఁబడి కొఱఁతయుఁ దీరదు కొంతైనా తెఱఁ గొసఁగేటి శ్రీతిరువేంకటపతి - నెఱిఁగీ నెఱఁగలే మిఁకనో తెరువు English(||pallavi||) tŏkkanisoṭlu dŏkkĕḍi manasu yĕkkaḍa gadile diṁkano tĕruvu (||tŏkka||) pābamu vāyadu pai pai manasuna kobamu dīradu kŏṁtainā dībana bādhayum̐ dīra dinniyunu yebunam̐ bĕnam̐gŏnĕ niṁkano tĕruvu (||tŏkka||) yĕvvanamadamunu nĕḍayadu korigĕ kŏvvunu naṇam̐gadu kŏṁtainā ravvagu mamagāramum̐ bĕḍam̐bāyadu yĕvvidhiyunu lediṁkavo tĕruvu (||tŏkka||) vĕṟabunu viḍuvadu vĕḍamāyalam̐baḍi kŏṟam̐tayum̐ dīradu kŏṁtainā tĕṟam̐ gŏsam̐geḍi śhrīdiruveṁkaḍabadi - nĕṟim̐gī nĕṟam̐gale mim̐kano tĕruvu