Title (Indic)చూడరే వో చెలులాల సుదతి సింగారము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చూడరే వో చెలులాల సుదతి సింగారము వేడుకతోడఁ దోడ విలాసము మించెను (॥॥) అలరిననెమ్మోము అద్దమయినకతన మెలుపునఁ గళల నేమించులు మించె లలిఁ దురుమెల్లా నీలపురాలైనకతన కలికిచూపులు నిండుఁ గాంతు లిట్టె మించెను (॥॥) పగటున మోవి బింబఫలమైయున్న కతన పొగడొందుమాటలతీపులు మించెను తగునాభి సరసియై తనరినకతమున సిగిడి మొక్కులకరనీరజములు మించె (॥॥) నెట్టన మేను లతై నెగడినకతమున కిట్టి శ్రీ వేంకటేశుకాఁగిటఁ బాఁకెను అట్టె చన్నులు నిమ్మపండ్లయి వుండినకతన పట్ట నితనిచేతులఁ బాదుకొని మించెను English(||pallavi||) sūḍare vo sĕlulāla sudadi siṁgāramu veḍugadoḍam̐ doḍa vilāsamu miṁchĕnu (||||) alarinanĕmmomu addamayinagadana mĕlubunam̐ gaḽala nemiṁchulu miṁchĕ lalim̐ durumĕllā nīlaburālainagadana kaligisūbulu niṁḍum̐ gāṁtu liṭṭĕ miṁchĕnu (||||) pagaḍuna movi biṁbaphalamaiyunna kadana pŏgaḍŏṁdumāḍaladībulu miṁchĕnu tagunābhi sarasiyai tanarinagadamuna sigiḍi mŏkkulagaranīrajamulu miṁchĕ (||||) nĕṭṭana menu ladai nĕgaḍinagadamuna kiṭṭi śhrī veṁkaḍeśhugām̐giḍam̐ bām̐kĕnu aṭṭĕ sannulu nimmabaṁḍlayi vuṁḍinagadana paṭṭa nidanisedulam̐ bādugŏni miṁchĕnu