Title (Indic)చూతమయ్యా యింకా నీపె సుద్దులెల్లాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చూతమయ్యా యింకా నీపె సుద్దులెల్లాను కాతరపు టీకె యెంత కలికియో కాని (॥చూత॥) నిమ్ముఁజూపులను జూచి సిగ్గులెల్లఁ బెడరేఁచి నిమ్మపండు గానుకిచ్చీ నెలఁత నీకు ఉమ్మగిలఁ జెయివట్టి వుబ్బుమాఁట లాడించి నెమ్మది నింకా నెంతేసి నేరుచునో కాని (॥చూత॥) యెలుఁగించి సన్న సేసి యెదుటనే నిలుచుండి యెలయింపునవ్వు చల్లీ నింతి నీమీఁద లలి సురటి విసరి కళలు మోమున రేఁచి నిలువున మోహ మెంతనెరపీనో కాని (॥చూత॥) పోసరించి సింగారించి పూవులు నీకు ముడిచి ఆసలే కడుఁజూపీ నతివ నీకు సేసవెట్టి కూడితివి శ్రీవేంకటేశ నన్ను నీసరి నున్నది తాను నీటెంతో కాని English(||pallavi||) sūdamayyā yiṁkā nībĕ suddulĕllānu kādarabu ṭīgĕ yĕṁta kaligiyo kāni (||sūda||) nimmum̐jūbulanu jūsi siggulĕllam̐ bĕḍarem̐si nimmabaṁḍu gānugichchī nĕlam̐ta nīgu ummagilam̐ jĕyivaṭṭi vubbumām̐ṭa lāḍiṁchi nĕmmadi niṁkā nĕṁtesi nerusuno kāni (||sūda||) yĕlum̐giṁchi sanna sesi yĕduḍane nilusuṁḍi yĕlayiṁpunavvu sallī niṁti nīmīm̐da lali suraḍi visari kaḽalu momuna rem̐si niluvuna moha mĕṁtanĕrabīno kāni (||sūda||) posariṁchi siṁgāriṁchi pūvulu nīgu muḍisi āsale kaḍum̐jūbī nadiva nīgu sesavĕṭṭi kūḍidivi śhrīveṁkaḍeśha nannu nīsari nunnadi tānu nīḍĕṁto kāni