Title (Indic)శిరసుండ మోకాల సేసవెట్టినయట్లు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) శిరసుండ మోకాల సేసవెట్టినయట్లు పరమధర్మము మాని పరచు(?) గావలసె (॥శిర॥) కోరి కఠారము మాని కోల చేతఁ బట్టుకొని బీరానఁ బోటుకుఁ బోయి పెట్టు డ్డట్టు యీరీతి ప్రపత్తి మాని యితరకర్మము సేసి సారె పుణ్యపాపములసందిఁ జిక్కవలసె (॥శిర॥) వై పైన వోడవిడిచి వదరు చేపట్టుకొని వైపుగాక యీఁది యీఁది వడిఁ బడ్డట్లు యేపున దాస్యము మాని యితరోపాయములు పూపస్వర్గభోగముల పుంగుడు గావలసె (॥శిర॥) ఘనమాణిక్యము మాని గాజుఁబూస గట్టుకొని వెనక జాణలచే నవ్వించుకొన్నట్లు యెనసిన శ్రీ వేంకటేశు శరణనలేక మును జన్మాదులలోన మునుగఁగ వలసె English(||pallavi||) śhirasuṁḍa mogāla sesavĕṭṭinayaṭlu paramadharmamu māni parasu(?) gāvalasĕ (||śhira||) kori kaṭhāramu māni kola sedam̐ baṭṭugŏni bīrānam̐ boḍugum̐ boyi pĕṭṭu ḍḍaṭṭu yīrīdi prabatti māni yidaragarmamu sesi sārĕ puṇyabābamulasaṁdim̐ jikkavalasĕ (||śhira||) vai paina voḍaviḍisi vadaru sebaṭṭugŏni vaibugāga yīm̐di yīm̐di vaḍim̐ baḍḍaṭlu yebuna dāsyamu māni yidarobāyamulu pūbasvargabhogamula puṁguḍu gāvalasĕ (||śhira||) ghanamāṇikyamu māni gājum̐būsa gaṭṭugŏni vĕnaga jāṇalase navviṁchugŏnnaṭlu yĕnasina śhrī veṁkaḍeśhu śharaṇanalega munu janmādulalona munugam̐ga valasĕ